IPO News: 2023 ఐపీవోల సంవత్సరంగా చెప్పుకోవచ్చు. చిన్నపెద్ద తేడా లేకుండా అనేక కంపెనీలు తమ ఐపీవోలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. పైగా ఇవన్నీ తొలిరోజు నుంచే ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తున్నాయి.
ఇప్పడు మనం మాట్లాడుకోబోతున్నది JSW గ్రూప్ ప్లాన్ చేస్తున్న మెగా ఐపీవో గురించే. దాదాపు 13 ఏళ్ల తర్వాత JSW గ్రూప్ ద్వారా మొదటి పబ్లిక్ ఇష్యూ ఇది కావచ్చు. నెలాఖరు నాటికి జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా రూ.2,800-2,850 కోట్ల ప్రారంభించాలని చూస్తున్నట్లు మనీకంట్రోల్ నివేదించింది. అయితే ఈ ఐపీవో పూర్తిగా ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ప్రస్తుతం కంపెనీ దేశంలో రెండవ అతిపెద్ద కమర్షియల్ పోర్ట్ ఆపరేటర్ గా కొనసాగుతోంది. ఇష్యూ ద్వారా వచ్చిన ఆదాయాన్ని కంపెనీ తన అనుబంధ సంస్థలైన JSW ధరమ్‌తర్ పోర్ట్, జైగఢ్ పోర్ట్‌ల రుణాన్ని చెల్లించడానికి అలాగే మరో రెండు అనుబంధ సంస్థలైన JSW జైఘర్ మూలధన వ్యయానికి ఆర్థిక సహాయం చేయాలని ప్లాన్ చేస్తోందని సమాచారం. అయితే దీనిపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్స్ చేయలేదు.
JSW ఇన్‌ఫ్రా గోవాలోని మోర్ముగావ్‌లో ఒక పోర్ట్ కలిగి ఉంది. దీనిని కంపెనీ 2002లో కొనుగోలు చేసింది. 2004లో కార్యకలాపాలను ప్రారంభించింది. కంపెనీ కార్యకలాపాలు భారతదేశం అంతటా 31 డిసెంబర్ 2022 నాటికి తొమ్మిది పోర్ట్ లకు విస్తరించాయి. FY22-23 కంపెనీ ఆదాయం భారీగా పెరిగి రూ.2,273 కోట్లకు చేరుకుంది. 23 బిలియన్ డాలర్ల విలువతో గ్రూప్ దేశంలోని ప్రఖ్యాత కంపెనీల్లో ఒకటిగా ఉంది. గ్రూప్ స్టీల్, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, సిమెంట్, పెయింట్స్, వెంచర్ క్యాపిటల్, స్పోర్ట్స్ వరంగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తోంది.


Click it and Unblock the Notifications