Adani News: 6 ఏళ్లు పోరాడి ఓడిపోయిన అదానీ.. గౌతమ్ అదానీ ప్లాన్ నాశనం చేసిన ఆ కంపెనీ..!

JSW Energy: దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందితున్న కుబేరుడు, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ. వాస్తవానికి కరోనా తర్వాత అదానీ షాపింగ్ చాలా తీవ్రతరం చేశారు. ముఖ్యంగా పవర్, సిమెంట్, ఇన్ ఫ్రా వంటి కీలక రంగాలపై ఫోకస్ పెంచింది అదానీ గ్రూప్. దీంతో పాటు పోర్ట్స్, విమానాశ్రయాల వ్యాపారంపై కూడా అదానీ తన దృష్టిని కొనసాగిస్తున్నారు. అయితే చాలా కాలం తర్వాత అదానీ దూకుడును ఒక కంపెనీ అడ్డుకోవటం మార్కెట్లో చర్చకు దారితీసింది.

వాస్తవానికి కెఎస్‌కె మహానది పవర్ కంపెనీని వేలంలో దక్కించుకోవాలని దాదాపు 6 ఏళ్లుగా గౌతమ్ అదానీ గ్రూప్ ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఈ ప్రయత్నాలను జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కంపెనీ అడ్డుకట్టవేసింది. తాజాగా జరిగిన వేలంలో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అత్యధికంగా రూ.15,985 కోట్లకు బిడ్ దాఖలు చేయటంతో శనివారం ముగిసిన వేలంలో అదానీ ఓడిపోయారు. ఈ క్రమంలో రెండు రోజుల పాటు జరిగిన వేలం ప్రక్రియలో 10 రౌండ్ల పాటు కొనసాగిన వేలంలో దాదాపు 6 కంపెనీలు పాల్గొన్నాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్ రూ.15885 కోట్ల రేటు వద్ద తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. చివరికి 11వ రౌండ్‌లో జేఎస్డబ్యూ ఎనర్జీ మరో రూ.100 కోట్లు అధిక బిడ్డింగ్ చేసి చివరికి కెఎస్‌కె మహానది కంపెనీని విజయవంతంగా దక్కించుకోగలిగింది.

JSW Energy shocked adani group by placing highest bid for KSK Mahanandi Power

కెఎస్‌కె మహానది కంపెనీని దక్కించుకోవటం కోసం నిర్వహించిన బిడ్డింగులో ఆర్థిక సేవల సంస్థ కాప్రి గ్లోబల్ కూడా రేసులో నిలిచింది. ఇదే సమయంలో దిగ్గజాలైన జిందాల్ పవర్, వేదాంత, ప్రభుత్వ విద్యుత్ సంస్థ NTPC లిమిటెడ్, SW ఎనర్జీ, జిందాల్ స్టీల్ అండ్ పవర్, ఐల్యాబ్ ఇండియా స్పెషల్ ఫండ్, రష్మీ మెటాలిక్స్, శ్రీషా హోల్డింగ్స్ చివరి వరకు కంపెనీని దక్కించుకునేందుకు భారీగా బిడ్డింగ్ చేశాయి. రిజల్యూషన్ ప్రక్రియలో రుణదాతల నుంచి రూ.29,330 కోట్ల క్లెయిమ్ లను రిజల్యూషన్ ప్రొఫెషనల్ అంగీకరించింది. ఛత్తీస్‌గఢ్‌ జంజ్‌గిర్ చంపా జిల్లాలో ఉన్న కెఎస్‌కె మహానది పవర్‌ ప్లాంట్ ఏప్రిల్ 2022 నుండి కార్పొరేట్ దివాలా ప్రక్రియను అమలు చేస్తోంది. కంపెనీ మార్చి 2018లో డిఫాల్ట్ కావటంతో రూ.21,760 కోట్ల అప్పులతో దివాలా ప్రక్రియను ఎదుర్కొంటోంది. KSK మహానది 40 GWని మార్చి 2018లో ప్రత్యేక పార్లమెంటరీ ప్యానెల్ నాన్-పెర్ఫార్మింగ్ అసెట్‌గా గుర్తించింది.

తాజాగా నిర్వహించిన కొనుగోలుతో మూడు ప్రధాన డీల్స్ క్లోజ్ చేసింది. విద్యుత్ రంగంలో JSW ఎనర్జీ వేగంగా అడుగులు వేస్తోందని ఈ చర్యల ద్వారా అర్థమౌతోంది. డిసెంబర్ 2022లో కంపెనీ రూ.1,048 కోట్లకు 700 మెగావాట్ల ఇండ్ బార్త్ ఎనర్జీ (ఉత్కల్)ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే మార్చి 2023లో కూడా మిత్రా ఎనర్జీ నుంచి 1,753 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంటును రూ.10,150 కోట్లకు దక్కించుకుంది. ఇదే క్రమంలో తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో బొగ్గు ఆధారిత 1800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కెపాటిసిటీ కలిగిన KSK మహానది పవర్ ప్లాంటును చేజిక్కించుకుంది. అయితే ఉదయం 9.45 గంటల సమయంలో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కంపెనీ షేర్ల ధర మార్కెట్లో ఒక్కోటి రూ.659 వద్ద స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+