IT News: టెక్ ఉద్యోగులు అనుకుంటున్నది, కోరుకుంటున్నది ఒకటైతే వాస్తవానికి జరుగుతుందో మరొకటి. చాలా కాలంగా ఊపిరి బిగబట్టుకుని తమ టైమ్ వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న వారి నెత్తిన ప్రఖ్యాత ఫైనాన్స్ సంస్థ జేపీ మోర్గన్ బాంబు పేల్చింది.
అవును భారత ఐటీ పరిశ్రమపై జేపీ మోర్గన్ అనలిస్టులు నెగటివ్ ధృక్పదాన్ని కలిగి ఉన్నారు. రాబోయే సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలు, భారతీయ IT కంపెనీల వ్యాఖ్యానాలను 'వాషౌట్' సంవత్సరంగా ఉంటాయని తేల్చి చెప్పారు. 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీల డీల్స్ విషయంలో పురోగతి ఉండొచ్చని పేర్కొన్నారు. ఇటీవల తాము చేపట్టిన తనిఖీల ప్రకారం భారత ఐటీ రంగంలో చెప్పుకోదగిన పురోగతి కనిపించలేదని అందువల్ల తాము నెగజివ్ ధోరణిని కొనసాగిస్తామని విశ్లేషకులు అంకుర్ రుద్ర, భావిక్ మెహతా ఒక నోట్‌లో తెలిపారు.

ఇన్ఫోసిస్ లిమిటెడ్ , టీసీఎస్, విప్రో లిమిటెడ్, హెచ్‌సీఎల్‌టెక్‌తో సహా అన్ని ప్రధాన ఐటీ సంస్థలు గతంలో బలహీన పరిస్థితులపై హెచ్చరించాయి. అధిక వడ్డీ రేట్లు ఉన్న కాలంలో.. క్లయింట్‌లలో ఎక్కువ మంది యూఎస్‌కు చెందినవారు. పైగా ఆర్థిక వృద్ధి మందగించడం, కాంట్రాక్టులను వారు తగ్గించడం, ఆలస్యం చేయడం, ఒప్పందాలను రద్దు చేయడం వంటివి చేస్తున్నారని స్టేక్ హోల్డర్లకు తెలిపాయి. ఈ లెక్కన సెప్టెంబరుతో ముగిసే రెండవ త్రైమాసికంలో ఐటీ కంపెనీల ఆదాయాలు తప్పక మార్కెట్లను నిరుత్సాహ పరుస్తాయని తెలుస్తోంది.

విస్తృత మార్కెట్‌లో కంటే ఐటీ రంగంపై మరింత ప్రతికూలంగా ఉన్నాయని.. ఈ కారణంగా డీల్ ర్యాంప్-అప్‌లు నిదానంగా ఉంటాయని జేపీ మోర్గన్ వెల్లడించింది. JP మోర్గాన్ 2025 ఆర్థిక సంవత్సరంలో లార్జ్-క్యాప్ IT కంపెనీలకు ఎక్కువ శాతం పరంగా అధిక సింగిల్-డిజిట్ ఆదాయాల వృద్ధిని అంచనా వేస్తుంది. ఈ క్రమంలోనే ఐటీ కంపెనీల రేటింగ్ అప్ గ్రేడ్ చేసింది. రానున్న వారం టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ తమ ఫలితాలను విడుదల చేస్తున్న తరుణంలో జేపీ మోర్గన్ నివేదిక మార్కెట్లలో పెను సంచలనానికి దారితీయనుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications