IT News: భారతీయ IT సంస్థలకు JP మోర్గాన్ షాక్.. ఇక ఉద్యోగుల ఆశలు గల్లంతే..
IT News: IT రంగంలో వెలుగొందుతున్న భారతీయ దిగ్గజ కంపెనీలు అతి త్వరలో గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతున్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. గ్లోబల్ ఎకానమీలో మందగమనం వల్ల కొత్త వ్యాపారాలను చేజిక్కించుకోవడంలో ఇండియన్ IT సేవల కంపెనీలకు ఎదురుదెబ్బ తప్పదంటూ షాక్ ఇచ్చింది.
భారతీయ ఐటీ సేవల కంపెనీలకు తగ్గుతున్న డిమాండ్ కారణంగా.. జూన్‌లో ఆయా సంస్థలపై ప్రతికూల అభిప్రాయాన్ని కొనసాగించాలని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ JP మోర్గాన్ నిర్ణయించింది. తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రాజెక్ట్‌లను కస్టమర్లు పునఃప్రారంభించేందుకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. తద్వారా రాబోయే 9 నెలల్లో వృద్ధిని ఆశించడం కష్టమేనని వెల్లడించింది.

JP మోర్గాన్ ప్రతికూల వాచ్ లిస్ట్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ మరియు ఎంఫసిస్ లు ఉన్నాయి. అందువల్ల FY24 మొదటి త్రైమాసికంలో ఈ 3 కంపెనీల ఆదాయాలు, మార్జిన్లు పెట్టుబడిదారులను నిరాశపరుస్తాయని భావిస్తున్నారు. TCS 3 శాతం, ఇన్ఫోసిస్ మరియు ఎంఫసిస్ 4 శాతం మేర రాబడి కోల్పోవచ్చని అంచనా.
దీనిని బట్టి చూస్తే రాబోయే 9 నెలల వరకు IT ఉద్యోగార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అర్థం చేసుకోవాలి. ఆయా కంపెనీల వ్యాపారం మందకొడిగా సాగుతున్న వేళ ఖర్చులను తగ్గించుకోవడానికి అవి ప్రయత్నిస్తాయి. ఈ సందర్భంగా కొత్త నియామకాలను నిలిపివేయడం, లేఆఫ్స్, జీతాల్లో కోతలు, వేతనాల పెంపు నిలిపివేత వంటి తీవ్ర చర్యలకూ వెనకాడకపోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications