Indian Economy: భారత వృద్ధిపై JP మోర్గాన్ సీఈవో కామెంట్స్.. కీలక కామెంట్స్.. అమెరికా విషయంలో..
Indian Economy: భారత్ ప్రస్తుతం కీలక ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో రూపాంతరం చెందుతోంది. ఈ క్రమంలో గతంలో లేని వేగంతో టాప్-10 దేశాల జాబితాలో ఇండియా ఉంది. నవభారత నిర్మాణం రానున్న దశాబ్ధానికి చాలా కీలకంగా మారనుంది.

చైనాకు దూరంగా..
భారత్ రాబోయే 10 ఏళ్లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందేందుకు సహాయపడే డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించిందని JP మోర్గాన్ చేజ్ CEO Jamie Dimon అభిప్రాయపడ్డారు. అమెరికా వడ్డీ రేట్ల పెంపుకు ముందు ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో ప్రపంచ సరఫరా గొలుసు మార్పు, తద్వారా కంపెనీలు చైనాపై ఆధారపడకుండా ఉండవచ్చన్నారు.

మార్కెట్లపై భారం.. అమెరికా
నిన్న అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మూడోసారి కూడా వడ్డీ రేట్లను 75 పాయింట్ల మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని వల్ల అంతర్జాతీయంగా మార్కెట్లు సర్ధుబాటు కావటం కష్టతరం చేస్తుందని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధంతో పాటు, తైవాన్‌పై యుద్ధ మేఘాలు అలుముకోవటం, రాజకీయ భౌగోళిక అస్థిరతల వల్ల ఎక్కువ నష్టం వాటిల్లుతోందని అన్నారు. రాబోయే రెండు దశాబ్దాల్లో అమెరికా భారతదేశానికి అత్యుత్తమ ప్రపంచ మిత్రదేశంగా ఉంటుందని డిమోన్ అభిప్రాయపడ్డారు.

భారత్ కృషి చేయాలి..
రాబోయే దశాబ్దంలో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం కృషి చేయాలని డిమోన్ అన్నారు. దీని కోసం అక్కడికి చేరుకోవటానికి ఏమి చేయాలి అన్నది చాలా కీలకమైన ప్రశ్నగా ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థలో వచ్చిన డిజిటల్ చెల్లింపులు రానున్న 10 ఏళ్ల వృద్ధికి పునాదిగా నిలుస్తుందని ఆయన అన్నారు.

తగ్గనున్న చైనా ప్రాభల్యం..
చైనాపై పూర్తిగా ఆధారపడిన ప్రపంచ సరఫరా గొలుసును ఇతర భౌగోళిక ప్రాంతాలకు మార్చడం వల్ల భారతదేశం తన తయారీ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి అవకాశం కల్పిస్తుందని ఆయన అన్నారు. ఇదే సమయంలో ఆపిల్, శామ్సంగ్, ఇంధన దిగ్గజం టోటల్ వంటి కంపెనీలు భారత్ లో తమ పెట్టుబడులను పెంచుతున్నాయి. చైనా వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం కోసం ఈ పెట్టుబడులను చేస్తున్నాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయాల కాక్‌టైల్ ఆర్థిక మార్కెట్‌లను అల్లకల్లోలంగా మారుస్తాయని వాల్ స్ట్రీట్ బ్యాంక్ CEO డిమోన్ అన్నారు.


Click it and Unblock the Notifications