JP Morgan: ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లలో ఆర్థిక మందగమనం ఒకటి. 2008 తరహా మాంద్యం తప్పదని కొందరు విశ్లేషకులు చెబుతుండగా.. భయపడాల్సిన పని లేదని మరికొందరు ఆర్థికవేత్తలు అభయమిస్తున్నారు. కానీ ఆయా దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాళా తీయండం చూస్తుంటే మాత్రం పరిస్థితి చేయిదాటిందని భావించక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో JP మోర్గాన్ చేజ్ & కో CEO లేఖ మార్కెట్ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
JP మోర్గాన్ చేజ్ & కో CEO జామీ డిమోన్ వాటాదారులకు ఇటీవల ఒక లేఖ రాశారు. USలో కొనసాగుతున్న బ్యాంకింగ్ సంక్షోభం, దాని దీర్ఘకాలిక ప్రభావాల గురించి అందులో ఆందోళన వ్యక్తం చేశారు. 43 పేజీలతో కూడిన ఈ లేఖలో.. బ్యాంకుల పనితీరు, నియంత్రణ మరియు భౌగోళిక రాజకీయాలతో సహా అనేక అంశాల గురించి ప్రస్తావించారు. ప్రస్తుత సంక్షోభం ఇంకా ముగియలేదని, రాబోయే సంవత్సరాల్లో దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

కొన్నేళ్ల క్రితం మాదిరిగానే ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని డిమోన్ తెలిపారు. సిలికాన్ వ్యాలీ బ్యాంకు, క్రెడిట్ సుస్సీల వైఫల్యాలను UBS ద్వారా గత నెలలో గట్టెక్కించిన తర్వాత బ్యాంకింగ్ రంగం కొత్త తరహా సంక్షోభంలోకి మళ్లిందన్నారు. ఇది 2008 తరహా మాంద్యం కానప్పటికీ ఈ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో స్పష్టంగా చెప్పలేమన్నారు. మార్కెట్‌లో చాలా గందరగోళాలు రేకెత్తగా.. ఆర్థిక పరిస్థితులు మరింత కఠినతరం అవుతాయని అభిప్రాయపడ్డారు.
2008లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం పెద్ద బ్యాంకులు, రుణదాతలు, భీమా సంస్థలను తీవ్రంగా నష్టపరచినట్లు JP మోర్గాన్ చేజ్ & కో CEO పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఏర్పడిన సంక్షోభంలో కొన్ని ఆర్థిక సంస్థలు, తక్కువ సమస్యలు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. తద్వారా వీటిని పరిష్కరించడం అంత కష్టమేమీ కాదన్నారు. అయితే బ్యాంకులతో పోటీపడుతూ రుణాలు, క్రెడిట్ కార్డులు జారీచేస్తున్న బ్యాంకింగేతర సంస్థల విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఖాతాదారులకు అవసరమైనప్పుడు రుణాలు అందించడానికి వెనకడుగు వేయడాన్ని ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications