Joy Alukkas: దేశంలో సంపన్నుల జాబితా ప్రతి ఏటా మారిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో తాజా 'ఫోర్బ్స్ లిస్ట్ ఆఫ్ ఇండియాస్ 100 రిచెస్ట్ 2023' వివరాలు బయటకు వచ్చాయి. ఇందులో దేశంలోనే సంపన్న జ్యూవెలర్‌గా ఉన్న వ్యక్తి వివరాలు పరిశీలిస్తే..
గోల్డ్ అంటే మనలో చాలా మందికి ఎంతో ఇష్టం. అలాంటి బంగారాన్ని అమ్ముతూ దేశంలో అగ్రగామి జ్యూవెలర్‌గా జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్, MD జాయ్ అలుక్కాస్‌ను భారతదేశంలో అత్యంత ధనిక ఆభరణాల వ్యాపారిగా ఫోర్బ్స్ ప్రకటించింది. ప్రస్తుతం ఆయన సంపన్నుల జాబితాలో 50వ స్థానంలో నిలిచారు. గత ఏడాది ఈ జాబితాలో ఆయన 69వ స్థానంలో కొనసాగారు. ఆయన సంపద నికర విలువ 4.4 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఫోర్బ్స్ అంచనా వేసింది.

జాయ్ అలుక్కాస్‌కు చెందిన గ్రూప్ ఆఫ్ కంపెనీలు FY2023లో రూ.14,513 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేశాయి. దేశంలో రూ.899 కోట్ల నికర లాభాన్ని అవి ఆర్జించాయి. అలాగే 2024 ఆర్థిక సంవత్సరానికి రూ.17,500 కోట్ల టర్నోవర్, రూ.1,100 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. జోయాలుక్కాస్ చెన్నైలో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఆభరణాల రిటైల్ దుకాణాన్ని కూడా నిర్వహిస్తోంది. తండ్రి అలుక్కాస్ వర్గీస్ వ్యాపార పునాదులపై తన సామ్రాజ్యాన్ని నిర్మించి ప్రస్తుతం బిలియనీర్ స్థాయికి ఆయన చేరుకున్నారు.
తండ్రి మరణం తర్వాత ఐదురుగు కుమారులు ఆభరణాల వ్యాపారాన్ని తమలో తాము పంచుకున్నారు. ఈ క్రమంలో జాయ్ అలుక్కాస్ UAEలో మూడు షోరూమ్‌లను తన వాటా కింద పొందారు. అలాగే అతని మిగిలిన నలుగురు సోదరులు ప్రతి ఒక్కరికి రెండు షోరూమ్‌లు అందుకున్నారు. జాయ్ అలుక్కాస్ దుబాయ్‌లో నివసిస్తున్నప్పటికీ.. అతను కేరళ త్రిస్సూర్‌లోని తన ఇంట్లో సంవత్సరానికి ఐదు నెలలు ఉంటారు. ప్రస్తుతం జోయాలుక్కాస్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 160 షోరూమ్‌లను కలిగి ఉంది. దేశంలో 100 షోరూమ్స్ ఉండగా వాటి సంఖ్యను 130కి పెంచాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. అలాగే విదేశాల్లో మరో 10 అవుట్‌లెట్‌లను ప్రారంభించాలని చూస్తోంది.


Click it and Unblock the Notifications