AP Gold Mines: ఏపీ జొన్నగిరి బంగారం గనుల నుంచి ఉత్పత్తి ఎప్పుడంటే..??
Deccan Gold Mines: ఏపీలో బంగారం గనుల్లో ఉత్పత్తి గురించి చర్చ మల్లీ తెరమీదకు వచ్చింది. తాజాగా లోక్ సభ ఎన్నికలు ముగియటంతో ఉత్పత్తి పనులు ఎక్కడివరకు వచ్చాయనే ఆత్రుత చాలా మందిలో కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని భారతదేశపు మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ మైన్స్ డెక్కన్ గోల్డ్ మైన్స్‌లో పూర్తి స్థాయి ఉత్పత్తి 2024 చివరి నాటికి ప్రారంభం కానుంది. ఇప్పటికే పైలట్ స్కేల్ ఆపరేషన్ ప్రారంభించిన జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి మెుదలైతే ఏడాదికి సుమారు 750 కిలోగ్రాముల బంగారాన్ని ఉత్పత్తి చేయగలదని దక్కన్ గోల్డ్ మైన్స్ మేనేజింగ్ డైరెక్టర్ హనుమ ప్రసాద్ తెలిపారు. పూర్తి స్థాయి ఉత్పత్తి కార్యకలాపాలు ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభమౌతాయని వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే 250 ఎకరాలను సేకరించారు. ప్రాసెసింగ్ ప్లాంట్ పనులు దాదాపు 60 శాతం పూర్తైనట్లు కంపెనీ వెల్లడించింది.

ఇప్పటి వరకు రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టిన ఈ గని ప్రస్తుతం నెలకు ఒక కిలో బంగారం ఉత్పత్తి చేస్తోందని దక్కన్ గోల్డ్ మైన్స్ ఎండీ వెల్లడించారు. ఇదిలా ఉండగా రాజస్థాన్‌లో అమ్మకానికి ఉంచిన రెండు బంగారు గనుల కోసం సాంకేతికంగా అర్హత కలిగిన బిడ్డర్లుగా వేదాంత గ్రూప్ సంస్థ హిందుస్థాన్ జింక్, జిందాల్ పవర్, JK సిమెంట్ పోటీలో నిలిచాయి. దీంతో ప్రస్తుతం ప్రైవేటు మైనింగ్ కంపెనీల కన్ను పసిడి తవ్వకాలపై పడింది.
రాంగడ్ మినరల్స్ అండ్ మైనింగ్ లిమిటెడ్, హిరాకుండ్ నేచురల్ రిసోర్సెస్ లిమిటెడ్, జిందాల్ పవర్, హిందుస్థాన్ జింక్, సయ్యద్ ఒవైస్ అలీ ఎడారి రాష్ట్రంలో భుకియా-జగ్‌పురా గోల్డ్ బ్లాక్ కోసం సాంకేతికంగా అర్హత పొందిన బిడ్డర్లుగా నిలిచారు. కాంక్రియా గారా గోల్డ్ బ్లాక్ విషయంలో రాజస్థాన్ ప్రభుత్వ గనులు & భూగర్భ శాస్త్ర విభాగం(DMG) వెబ్‌సైట్ ప్రకారం హిరాకుండ్ నేచురల్ రిసోర్సెస్, పొద్దార్ డైమండ్, ఒవైస్ మెటల్ & మినరల్స్ ప్రాసెసింగ్, హిందుస్థాన్ జింక్, JK సిమెంట్ సాంకేతికంగా అర్హత పొందిన బిడ్డర్లుగా ఎంపికైనట్లు వెల్లడైంది. దీంతో పడిని నిక్షేపాల తవ్వకంపై ప్రైవేటు కంపెనీల ఉత్సాహం కొనసాగుతో


Click it and Unblock the Notifications