Andhra Pradesh: ఏపీలో అతిపెద్ద గోల్డ్‌మైన్.. గ్రాముల్లో కాదు కేజీల్లో బంగారం నిల్వలు..
Jonnagiri Gold Project: ఏపీలో బంగారం తవ్వకాలపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఈ ప్రాజెక్టును ఒక ప్రైవేటు కంపెనీ చేపడుతున్న తరుణంలో ఎప్పుడు మెుదలవుతుందనే వార్తల్లో ప్రధానంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే తొలి భారీ ప్రైవేట్ బంగారు గని పూర్తి స్థాయి ఉత్పత్తి వచ్చే ఏడాది చివరి నాటికి ప్రారంభమవుతుందని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హనుమ ప్రసాద్ తెలిపారు. ఇప్పటికే పైలట్ స్కేల్ ఆపరేషన్ ప్రారంభించిన జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి ఉత్పత్తిని ప్రారంభించిన తర్వాత ఏడాదికి 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుందని ప్రసాద్ వెల్లడించారు. బీఎస్ఈలో లిస్ట్ అయిన మెుదటి, ఏకైక అన్వేషణ సంస్థ డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్(DGML) నిలిచింది.

కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాలకు సమీపంలో ఉన్న గని 2013లో మంజూరు చేయబడింది. అన్వేషణ పూర్తి చేయడానికి దాదాపు దశాబ్దం పట్టింది. ప్రస్తుతం ఈ గని నెలకు సుమారు కిలో బంగారాన్ని ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.200 కోట్లను పెట్టుబడిగా పెట్టినట్లు సమాచారం DGMLకి 60 శాతం వాటా ఉన్న కిర్గిజ్‌స్థాన్‌లోని మరో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ నుండి ఉత్పత్తి 2024 అక్టోబర్ లేదా నవంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హనుమ ప్రసాద్ వెల్లడించారు.
2003లో స్థాపించబడిన DGML.. భారతదేశంతో పాటు విదేశాల్లో బంగారు అన్వేషణలో పాల్గొంది. కర్ణాటకలో ఓపెన్ పిట్‌బుల్ గోల్డ్ డిపాజిట్‌లను కనుగొనడంలో దోహదపడింది.


Click it and Unblock the Notifications