Jonnagiri Gold Mine: భారతదేశంలో బంగారం పట్ల ప్రజలకు ఉన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినదిగా చెప్పుకోవచ్చు. పెళ్లిళ్లు, పండుగలు, పెట్టుబడులు ఇలా ప్రతి సందర్భంలో బంగారం కీలక పాత్ర పోషిస్తుంది.అయితే ఈ అవసరాలన్నింటినీ తీర్చుకోవడానికి దేశం బంగారం కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతోంది. ప్రతి సంవత్సరం భారతదేశం దాదాపు 1,000 టన్నుల విలువైన బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్ద భారంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని జొన్నగిరి బంగారు గని ప్రాజెక్ట్ ఒక చారిత్రక మలుపుగా భావించబడుతోంది. భారతదేశ తలరాతను మార్చబోతోంది.
ఇప్పటి వరకు భారత్‌లో బంగారం తవ్వకాలు ప్రధానంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగేవి. కానీ డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (DGML) అనే ప్రైవేట్ సంస్థ.. దేశంలో మొట్టమొదటిసారిగా పెద్ద ప్రైవేట్ బంగారు గనిని అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చింది. DGMLకి చెందిన భాగస్వామి సంస్థ జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తోంది. జొన్నగిరి గని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో జొన్నగిరి, ఎర్రగుడి, పగడిరాయి గ్రామాల సమీపంలో ఉంది. ఈ ప్రాంతంలో మట్టిలోని బంగారు ఖనిజాలను శాస్త్రీయ పద్ధతుల్లో వెలికితీసి శుద్ధి చేసే ప్రక్రియ ప్రారంభమైంది.

DGML మేనేజింగ్ డైరెక్టర్ హనుమ ప్రసాద్ ప్రకారం.. ప్లాంట్ ఇప్పటికే పర్యావరణ అనుమతులు పొందింది. అలాగే ఇతర రాష్ట్ర అనుమతుల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ స్థిరీకరణ దశలో ఉంది. పూర్తిస్థాయి ఉత్పత్తి త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు. ప్రారంభంలో ఈ గని సంవత్సరానికి సుమారు 750 కిలోల బంగారం ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు. మరో రెండు మూడు సంవత్సరాల్లో ఈ ఉత్పత్తి 1,000 కిలోల వరకు పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. భారతదేశం ప్రస్తుతం సంవత్సరానికి కేవలం 1.5 టన్నుల బంగారం మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. జొన్నగిరి ప్రాజెక్ట్ పూర్తిగా అమల్లోకి వస్తే, దేశీయ ఉత్పత్తి దాదాపు ఒక టన్ను మేర పెరగనుంది. అంటే ఇప్పటి ఉత్పత్తికి రెట్టింపు స్థాయిలో ఉంటుంది.
దేశీయంగా బంగారం తవ్వకం ప్రారంభం కావడం వల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. దీని వలన భారత్ బిలియన్ల డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసుకోగలదు. అదనంగా, ఈ ప్రాజెక్ట్ వల్ల స్థానికులకు ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ప్రస్తుతం బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఈ సందర్భంలో దేశీయంగా బంగారం ఉత్పత్తి చేయడం ద్వారా భారత్ ఆర్థికంగా కొంత స్థిరత సాధించే అవకాశం ఉంటుంది. డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కేవలం భారత్‌లోనే కాకుండా కిర్గిజిస్తాన్, ఫిన్లాండ్, టాంజానియా వంటి దేశాల్లో కూడా మైనింగ్ ప్రాజెక్టులు కలిగి ఉంది. అంటే, భారత ప్రైవేట్ రంగం అంతర్జాతీయ బంగారం తవ్వకాల్లోనూ తమ ముద్ర వేస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications