Multibagger stock: 6 రోజులుగా అప్పర్ సర్క్యూట్ కొడుతున్న మల్టీబ్యాగర్.. మీ దగ్గర ఉందేమో చెక్ చేసుకోండి!
Multibagger stock: భారతీయ IT దిగ్గజాలకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా వాటి రాబడిలో భారీగా కోతలు ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా. ఈ పరిస్థితుల్లో సాఫ్ట్ వేర్ రంగానికి చెందిన ఓ స్మాల్ క్యాప్ స్టాక్ వండర్స్ సృష్టిస్తోంది. దిగ్గజాలు అందుకోలేని ఫాస్ట్ తో దూసుకుపోతోంది.
జోంజువా ఓవర్సీస్ లిమిటెడ్ అనేది సాఫ్ట్ వేర్ రంగానికి చెందిన ఓ స్మాల్ క్యాప్ స్టాక్. గత 6 రోజులుగా కంపెనీ షేర్లు అప్పర్ సర్క్యూట్ ను తాకుతున్నాయి. అర్హులైన ఇన్వెస్టర్స్ కు 9 బోనస్ షేర్లు ఇస్తున్నట్లు ప్రకటించించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో పెట్టుబడిదారుల నుంచి కొనుగోళ్ల ఒత్తిడి విపరీతంగా కొనసాగుతోంది.

గత 5 రోజుల్లో ఈ స్టాక్ 21 శాతానికి పైగా పెరిగింది. ఇక నెలరోజులుగా చూస్తే 19 శాతం రిటర్న్ ఇచ్చింది. 6 నెలల్లో 65 శాతానికి పైగా ఎగబాకి.. ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసింది. పెట్టుబడిదారుల ప్రతి 50 షేర్లకు గాను కంపెనీ 9 బోనస్ షేర్లు ఇవ్వనుండగా.. రికార్డు తేదీని అక్టోబర్ 10గా నిర్ణయించింది.
ఈ రేంజ్ లో పెట్టుబడిదారులకు బోనస్ షేర్లు ఇవ్వడం కంపెనీకి కొత్తేమీ కాదు. 2022లో ప్రతి 23 షేర్లకు 4 బోనస్ షేర్లు అందించింది. ఇక 2021లోనూ అర్హత కలిగిన ఇన్వెస్టర్స్ 5 బోనస్ షేర్లు పొందారు. తద్వారా వరుసగా మూడో ఏడాదీ పెట్టుబడిదారులకు బోనస్ షేర్లు ఇవ్వాలని కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది.


Click it and Unblock the Notifications