ప్రపంచాన్ని గజాగజా వణికిస్తున్న కరోనా వైరస్ నివారణ కోసం వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఇప్పుడు ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తుంది. ఇప్పటికే ఇండియా లోని పలు కంపెనీలు వ్యాక్సిన్ తయారీపై దృష్టి సారించాయి . భారత్ బయోటెక్, జాన్సన్ అండ్ జాన్సన్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు వ్యాక్సిన్ తయారీలో బిజీగా ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ ను తయారుచేయడం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నజాన్సన్ అండ్ జాన్సన్ భారీస్థాయిలోవ్యాక్సిన్ పై ప్రయోగాలు చేపట్టింది.

సెప్టెంబర్ తొలివారంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం .. జాన్సన్ & జాన్సన్ ప్రకటన
ఇప్పటికే మొదటి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసుకున్న జాన్సన్ అండ్ జాన్సన్, మూడవదశ క్లినికల్ ట్రయల్స్ కు రంగం సిద్ధం చేసుకుంటోంది .ఈ మూడవ దశలో దాదాపు 60 వేల మంది ప్రయోగాలు జరిపేందుకు కావలసిన సన్నాహాలు చేసుకుంటోంది. సెప్టెంబర్ తొలివారంలో ప్రారంభమయ్యే ఈ ప్రయోగం అతిపెద్ద క్లినికల్ ట్రయల్ గా మారనుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
జాన్సన్ అండ్ జాన్సన్ జన్న్ స్సేన్ పేరుతో తయారుచేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 60 వేల మందిపై ప్రయోగించనున్నట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు. యునైటెడ్ స్టేట్స్ , మెక్సికో తో సహా ఇతర దేశాలలో మొత్తం 180 చోట్ల ఈ ప్రయోగం నిర్వహించబడుతుంది అని వెల్లడించారు.

2021 నాటికి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకువచ్చే ఛాన్స్
మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ సాధ్యమైనంత అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించబడుతుంది అని వారు పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో, తీవ్రత ఎక్కువగా ఉన్న చోట ఈ వ్యాక్సిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ లోభాగంగా ప్రయోగిస్తామని వారు వెల్లడించారు. ఇక మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన అధ్యయనాలు ఎక్కడ జరగాలి అనేది నిర్ణయించడానికి సంస్థ ఎపిడియోలాజికల్ డేటాను ఉపయోగిస్తుందని , త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. 2021 నాటికి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్లుగా సంస్థ అంచనా వేస్తుంది.

బ్రెజిల్ లో ప్రయోగాల కోసం అనుమతి
జాన్సన్ అండ్ జాన్సన్ మూడో దశ ప్రయోగాల కోసం ఇప్పటికే అనుమతి ఇచ్చినట్లు బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది .బ్రెజిల్లో మూడో దశ ప్రయోగాల కోసం అనుమతి పొందిన 4వ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్. ప్రపంచ వ్యాప్తంగా 160 వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉండగా 30 వ్యాక్సిన్లు మానవ ప్రయోగ దశకు చేరుకున్నట్లు సమాచారం .భారత్లోని చాలా ఫార్మా కంపెనీలు పోటాపోటీగా వ్యాక్సిన్ తయారు చేస్తున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్ మూడో దశ ప్రయోగాలు సక్సెస్ అయితే వ్యాక్సిన్ ను మార్కెట్లోకి తీసుకురానుంది.

జాన్సన్ & జాన్సన్ నుండి తయారయ్యే కరోనా వ్యాక్సిన్లను కొనుగోలు చేస్తామన్న బ్రిటన్
జాన్సన్ & జాన్సన్ నుండి తయారయ్యే కరోనా వ్యాక్సిన్లను కొనుగోలు చేస్తామని బ్రిటన్ తెలిపింది. ఒప్పందం ప్రకారం, జాన్సన్ & జాన్సన్ యొక్క జాన్సెన్ ఫార్మాస్యూటికా యూనిట్ తమ వ్యాక్సిన్ ను జన్న్ స్సేన్ Ad26.COV2.S అని పేరు పెట్టింది . కరోనా మహమ్మారి కట్టడి కోసం అతి తక్కువ ధరలకే వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి తీసుకురావాలని ఆలోచిస్తుంది.మరో వ్యాక్సిన్ తయారీ సంస్థ మోడెర్నా ఇంక్ మరియు ఫైజర్ వారి చివరి దశ అధ్యయనాల కోసం 30,000 మంది వాలంటీర్లను నియమించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications