Wipro News: విప్రో ఆఫీసు బయట టెక్కీలు.. అసలు ఏం జరిగిందంటే..?
IT News: కరోనా తర్వాత అంతర్జాతీయంగా దిగజారిన ఆర్థిక పరిస్థితులతో జాబ్ మార్కెట్ నిజంగా కఠినంగా మారిపోయింది. కొందరు రెండు మూడు ఉద్యోగాలు చేసిన రోజుల నుంచి కనీసం ఉద్యోగం దొరకని రోజులు వచ్చాయి.
అనేక కంపెనీలు గత కొన్ని నెలలుగా లేఆఫ్ బాట పట్టాయి. దీంతో కంపెనీలు ఖాళీలు తెరిస్తే వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ప్రస్తుతం టెక్ దిగ్గజం విప్రోకు చెందిన కోల్‌కతా ఆఫీసు బయట వేల సంఖ్యలో ఉద్యోగార్థులు నిలబడి వేచిచూస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇది నిరుద్యోగిత నిజరూపానికి అద్ధం పడుతోందని అనేక మంది అభిప్రాయపడుతున్నారు.

ఐటీ కంపెనీ బయటం వేల మంది ప్రజలు గుమిగూడి ఇంటర్వ్యూ కోసం వేచి చూస్తున్న పరిణామం అక్కడ చోటుచేసుకుంది. వాక్-ఇన్ ఇంటర్వ్యూల సమయంలో వేలాది మంది దరఖాస్తుదారులతో విప్రో కార్యాలయానికి రావటం ఇప్పుడు మతిపోగొడుతోంది. వాక్-ఇన్ సమయంలో విప్రో కోల్‌కతా కార్యాలయం బయట దాదాపు 10,000కి పైగా దరఖాస్తుదారులు ఉన్నట్లు ట్విట్టర్లో ఒక యూజర్ వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో జాబ్ మార్కెట్ల అధ్వాన్న స్థితి గురించి ట్విట్టర్‌లో చర్చకు దారితీసింది.
ఇలాంటి సందర్భమే తనకు 18 ఏళ్ల కిందట ఎదురైందని టీసీఎస్ వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరైన ఒక వ్యక్తి తన అనుభవాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు. అప్పట్లో 300 ఉద్యోగ ఖాళీల కోసం దాదాపు 15,000 మంది దరఖాస్తు చేసుకున్నారని గుర్తుచేసుకున్నారు. అనేక మంది దేశంలో ఉన్న నిరుద్యోగిత, తగ్గిన ఉద్యోగ అవకాశాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఇదే పెద్ద ఉదాహరణ అంటున్నారు.


Click it and Unblock the Notifications