IPO News: ఐపీవో లాభాల సునామీ.. నేడు అడుగుపెట్టగానే షేరుకు రూ.300 పెరిగింది..
JNK India IPO: నెలాఖరున నేడు దేశీయ స్టాక్ మార్కెట్లోకి వరుస ఐపీవోలు క్యూకడుతున్నాయి. ఉదయం ఎస్ఎమ్ఈ కేటగిరిలో వచ్చిన ఐపీవో డబ్బులు డబులు చేయగా.. తాజాగా మరో ఐపీవో కూడా ఇన్వెస్టర్ల సంపదను అమాంతం తొలిరోజే పెంచేసింది. దీంతో పెట్టుబడిదారులు భారీ లాభాలను ఆస్వాధిస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది జేఎన్‌కే ఇండియా షేర్ల గురించే. మార్కెట్‌లోకి ప్రవేశించిన వెంటనే ఐపీవో షేర్లు పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందించాయి. నేడు కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో 49 శాతం కంటే ఎక్కువ ప్రీమియంతో రూ.621 వద్ద జాబితా అయ్యాయి. ఇదే క్రమంలో బీఎస్ఈలో ఒక్కో షేరు రూ.620 రేటు వద్ద లిస్టయ్యాయి. ఐపీవోలో జేఎన్‌కే ఇండియా షేర్ల ధర రూ.415 వద్ద ఇష్యూ చేయబడ్డాయి. కంపెనీ ఐపీవో 23 ఏప్రిల్ 2024న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకుని ఏప్రిల్ 25న ముగిసింది.

బలమైన లిస్టింగ్ తర్వాత కూడా జేఎన్‌కే ఇండియా షేర్లలో విపరీతమైన పెరుగుదల కనిపించింది. విజయవంతంగా జాబితా అయ్యాక బీఎస్ఈలో కంపెనీ షేర్లు 11 శాతానికి పైగా పెరిగి రూ.709.85కి చేరాయి. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కంపెనీ షేర్లు రూ.709.80 గరిష్ట స్థాయిని తాకాయి. జేఎన్‌కే ఇండియా పబ్లిక్ కంపెనీ ఐపీవో ఇష్యూ మొత్తం పరిమాణం రూ.649.47 కోట్లుగా ఉంది. వాస్తవానికి రూ.300 కోట్లకు తాజా ఈక్విటీ షేర్లను విక్రయించగా.. మిగిలిన రూ.349.47 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఐపీవోలో విక్రయించింది.
విజయవంతంగా పూర్తైన ఐపీవో మొత్తం 28.46 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 4.20 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కేటగిరీలో వాటా 23.80 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల కోటా 74.40 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. జేఎన్‌కే ఇండియా ఐపీవోలో రిటైల్ పెట్టుబడిదారులు కనీసం 1 లాట్ పందెం వేసేందుకు కనీసం రూ.14,940 పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. తాజా ఐపీవో నుంచి సేకరించిన నిధులను కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలతో పాటు సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలు వినియోగించాలని చూస్తోంది.


Click it and Unblock the Notifications