IPO News: ఐపీవో కోసం తహతహలాడుతున్న కంపెనీ.. సెబీకి దరఖాస్తు.. పూర్తి వివరాలు..
IPO News: మహారాష్ట్రకు చెందిన హీటింగ్ పరికరాల తయారీ సంస్థ JNK ఇండియా తన పబ్లిక్ ఇష్యూ ప్లాన్‌ల కోసం రెగ్యులేటర్ సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది.
మార్కెట్లో ఐపీవో ఫ్లోట్ చేయటం ద్వారా కంపెనీ రూ.300 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రమోటర్లు, పెట్టుబడిదారులకు చెందిన 84,21,052 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో గౌతమ్ రాంపెల్లి, దీపక్ కచారులాల్ భారుకా, JNK హీటర్స్, మస్కట్ క్యాపిటల్ అండ్ మార్కెటింగ్, మిలింద్ జోషి OFSలో పాల్గొననున్నారు.

ఒకవేళ కంపెనీ ప్రీ- ఐపీవో ప్లేస్‌మెంట్‌ను చేపట్టినట్లయితే.. ఆ మొత్తం తాజా ఇష్యూ పరిమాణం నుండి తగ్గించబడుతుంది. ఐపీవో నుంచి వచ్చిన మెుత్తంలో ప్రధానంగా రూ.275.72 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, మిగిలిన మెుత్తాన్ని సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం.. ఆఫర్ ఖర్చుల కోసం ఉపయోగించబడతాయి. కంపెనీలో 94.56 శాతం వాటాను.. ప్రమోటర్లు గౌతమ్ రాంపెల్లి, దీపక్ కచరులాల్ భారుకా, JNK హీటర్స్, మస్కట్ క్యాపిటల్ కలిగి ఉన్నాయి. మిలింద్ జోషికి 4.96 శాతం వాటా ఉంది.
దక్షిణ కొరియా కంపెనీ JNK హీటర్స్, మస్కట్ క్యాపిటల్ వరుసగా 25.79 శాతం, 46.62 శాతం వాటాలతో కంపెనీలో కార్పొరేట్ ప్రమోటర్లుగా ఉన్నాయి. JNK ఇండియా గత సంవత్సరాల్లో ఆరోగ్యకరమైన ఆర్థిక పనితీరును నివేదించింది. FY23లో రూ.46.4 కోట్ల నికర లాభాన్ని, రూ.407.3 కోట్ల ఆదాయాన్ని నివేదించింది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో EBITDA మార్జిన్ 18-19 శాతం, PAT మార్జిన్ 11-12 శాతంగా ఉన్నాయి.
ఆర్డర్ బుకింగ్ పరంగా భారతదేశంలోని ప్రముఖ హీటింగ్ ఎక్విప్‌మెంట్ కంపెనీలలో ఒకటిగా కంపెనీ ఉంది. థర్మల్ డిజైనింగ్, ఇంజనీరింగ్, తయారీ, సరఫరా, ఇన్‌స్టాల్ చేయడం, ప్రాసెస్ ఫైర్డ్ హీటర్‌లు, రిఫార్మర్లు & క్రాకింగ్ ఫర్నేస్‌లలో సామర్థ్యాలను కలిగి ఉంది. చమురు, వాయువు శుద్ధి కర్మాగారాలు, పెట్రోకెమికల్స్, ఎరువులు, హైడ్రోజన్ అండ్ మిథనాల్ ప్లాంట్లు మొదలైన ప్రక్రియ పరిశ్రమలలో హీటర్లు, ఫార్మర్లు & క్రాకింగ్ ఫర్నేసులను వినియోగిస్తుంటారు.


Click it and Unblock the Notifications