కొత్తగా ప్రవేశపెట్టిన GST రేట్లతో కార్ల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. భారతదేశంలో కార్ల తయారీదారులు తమ వాహనాల ధరలను తగ్గించడం మొదలుపెట్టారు. తాజా పరిణామంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) కంపెనీ లగ్జరీ SUV మోడల్స్ అయిన రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ వాహనాల ధరలను భారీగా తగ్గించే నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గింపులు వినియోగదారులకు భారీ ప్రయోజనాలను కలిగించనున్నాయి. అందులో రేంజ్ రోవర్ ధర రూ. 4.6 లక్షల నుండి రూ.30.4 లక్షల వరకు తగ్గించనుంది కంపెనీ. అలాగే, డిఫెండర్ మోడల్ ధర రూ. 7 లక్షల నుంచి రూ. 18.6 లక్షల వరకు తగ్గింపు పొందింది. డిస్కవరీ వాహనాల ధర రూ. 4.5 లక్షల నుండి రూ. 9.9 లక్షల వరకు తగ్గించారు.
ఈ నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకున్న GST రేట్ల మార్పు చర్యల తరువాత వచ్చింది. గతంలో అనేక మోడల్స్‌పై ఉన్న అధిక పన్ను భారాన్ని తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. దీనివల్ల ప్రీమియం కార్ల మార్కెట్ మీద మంచి ప్రభావం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. JLR ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ అంబ మాట్లాడుతూ GST సవరణనతో ధరల తగ్గింపు వినియోగదారులకు, పరిశ్రమకు మంచి రోజులను సూచిస్తుంది. ఇది భారతదేశంలో లగ్జరీ మార్కెట్ పట్ల మా నిబద్ధతను బలోపేతం చేస్తుందని తెలిపారు.

ఈ చర్య వలన కేవలం ప్రీమియం వాహనాలపై మాత్రమే కాకుండా.. మొత్తం ఆటోమొబైల్ రంగంలో పోటీ పెరుగుతుందన్నారు. వినియోగదారులకు మరిన్ని ఆప్షన్లు లభిస్తాయని నిపుణులు భావిస్తున్నట్లు తెలిపారు. JLR సంస్థ ప్రత్యేకంగా ఫెస్టివ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు చెప్పారు. పండుగలకు ముందు ధర తగ్గించడం వినియోగదారులకు మంచి అవకాశం అని వారు పేర్కొన్నారు.
ఇప్పటి వరకు ఈ రంగంలో ఉన్న ఇతర బ్రాండ్లు కూడా ధరలను తగ్గించి వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే JLR చేసిన భారీ తగ్గింపు అత్యంత గమనించదగిన అంశంగా చెప్పుకోవచ్చు.సవరించిన ధరలపై ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి, JLR షోరూమ్‌ను సంప్రదించాలని కంపెనీ సిఫార్సు చేసింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications