IPO News: తొలిరోజే లాభాలు ఆవిరైన ఐపీవో.. లోయర్ సర్క్యూట్ తాకిన స్టాక్.. కొన్నారా..
Jiwanram IPO: ఈరోజు మెుత్తం రెండు కంపెనీల ఐపీవోలు మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఒకటి జూపిటర్ హాస్పిటల్స్ కాగా మరొకటి జీవన్‌రామ్ శ్యోదత్తరాయ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీది.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది జీవన్‌రామ్ శ్యోదత్తరాయ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఐపీవో గురించే. ఎస్ఎమ్ఈ కేటగిరీకి చెందిన ఈ ఐపీవో ఉదయం 30 శాతం లాభాలతో మార్కెట్లో లిస్ట్ అయ్యింది. కంపెనీ ఐపీవోలో ఒక్కో షేరును రూ.23 చొప్పున విక్రయించగా.. రూ.30 చొప్పున ప్రీమియం ధరకు మార్కెట్లో జాబితా జరిగింది. అయితే బలమైన ప్రారంభం తర్వాత స్టాక్ ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేసింది.

లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్లు ఒక్కసారిగా లాభాల స్వీకరణకు మెుగ్గుచూపి అమ్మకాలు ప్రారంభించటంతో స్టాక్ 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. దీంతో షేర్ ధర రూ.28.50కి పడిపోయింది. ఈ ఐపీవో సెప్టెంబర్ 8న సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభించబడి సెప్టెంబర్ 12న ముగిసింది. ఈ క్రమంలో 112.96 రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్ పొందింది. జీవన్ రామ్ ఐపీవో ద్వారా రూ.17.07 కోట్లను సమీకరించాలని 74,22,000 ఈక్విటీ షేర్లను ఇష్యూ చేసింది.
కంపెనీ వ్యాపారం విషయానికి వస్తే.. ఇది పారిశ్రామిక భద్రతలో వినియోగించే గ్లౌజులు, దుస్తుల తయారీ ఎగుమతి వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కంపెనీ అత్యాధునిక ఉత్పత్తి కర్మాగారాన్ని నిర్మించింది. అమెరికా, స్పెయిన్, జర్మనీ, బెల్జియంలకు ప్రస్తుతం వీటిని ఎగుమతి చేస్తోంది. గతంలో ప్రమోటర్ గ్రూప్ కంపెనీలో ఏకంగా 99.996% వాటాను కలిగి ఉండగా.. తాజా ఐపీవో వాటాల విక్రయం తర్వాత వారి వాటా 70.01 శాతానికి తగ్గింది. జీవన్‌రామ్ శియోదత్తరాయ్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం రూ.42 కోట్ల టర్నోవర్ కలిగి ఉంది.


Click it and Unblock the Notifications