Jiotag: ఏవైనా విలువైన వస్తువులు పోయినా, దొంగిలించినా సాధారణంగా ఏం చేస్తాం? సాధ్యమైనంత మేరకు వెదుకుతాం లేదా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇస్తాం. కానీ తిరిగి దొరుకుతుంది అన్న గ్యారెంటీ మాత్రం ఉండదు. అయితే పెరుగుతున్న సాంకేతికతను వినియోగించుకుని ఈ తరహా ఇబ్బందులకు చెక్ పెట్టొచ్చని ఆపిల్ ఎయిర్‌ట్యాగ్ తరహా గ్యాడ్జెట్స్ నిరూపించాయి.
జియోట్యాగ్ అనేది ఆపిల్ ఎయిర్ ట్యాగ్ కు క్లోన్ వంటిది. ఇది పోయిన, దొంగిలించబడిన వస్తువులను ట్రాక్ చేసే అవకాశం కల్పిస్తుంది. జియో వెబ్‌సైట్‌లో ఈ గ్యాడ్జెట్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్స్, ధర అందుబాటులో ఉంది. ఇండియాలో ఒక జియోట్యాగ్ వెల 749గా కంపెనీ నిర్ణయించబడింది.

జియోట్యాగ్ ఐటెమ్ ట్రాకర్ చౌకగా ఉండటమే కాకుండా, చాలా చిన్నదిగా ఉంటుంది. అవసరాలకు అనుగుణంగా వివిధ ట్రాకర్లను కొనుగోలు చేయవచ్చు. కీస్ కోసం ఒకటి, వ్యాలెట్ లేదా బ్యాగ్ కోసం మరొకటి ఇలా వివిధ రకాలుగా వినియోగించుకోవచ్చు. ఆపిల్ ఎయిర్‌ట్యాగ్స్ 3 వేల 490 నుంచి ప్రారంభం అవుతుంది. వాటితో పోలిస్తే జియోట్యాగ్స్ చాలా తక్కువ ధరకే దొరుకుతాయి.
బ్లూటూత్ మరియు కస్టమ్ ఫైండ్ మై యాప్‌ను జియోట్యాగ్ ఉపయోగిస్తుంది. జియో బాక్స్‌లో లాన్యార్డ్ కేబుల్‌ను బండిల్ చేస్తోంది కానీ ఆపిల్ ఇలా చేయదు. దీనివల్ల వ్యాలెట్, బ్యాగ్ లేదా కీస్ జోడించడం సులభం మరియు కోల్పోయే అవకాశం తక్కువగా ఉంటుంది. ఏడాదిపాటు బ్యాటరీ లైఫ్ ఉంటుందని తెలుస్తోంది. ట్రాకర్‌తో పాటు విడి బ్యాటరీ సైతం వస్తోంది.
ట్రాకర్ బ్లూటూత్ 5.1ని ఉపయోగిస్తుంది. ఇంటి లోపల 20 మీటర్లు, ఆరుబయట 50 మీటర్ల వరకు పని చేస్తుంది. అయితే డిస్‌కనెక్ట్ చేయబడిన జియోట్యాగ్‌ని గుర్తించడానికి జియో కమ్యూనిటీ ఫైండ్ నెట్‌వర్క్‌ని ఉపయోగించవచ్చని కంపెనీ చెప్పింది. ఫోన్ ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా ట్రాకర్ గుర్తించగలదు. దీనిపై రెండుసార్లు నొక్కితే చాలు, ఫోన్ నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ రింగ్ అయ్యేలా చేస్తుంది.


Click it and Unblock the Notifications