ఇంట్లో ఉన్న టీవీనే కంప్యూటర్‌గా మార్చేస్తే ఎలా ఉంటుంది? అదే కిక్ ఇచ్చే ప్రొడక్ట్‌ని రిలయన్స్ జియో కొత్తగా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. 48వ వార్షిక AGMలో ప్రకటించిన జియో పీసీ (JioPC) అసలు CPU లేకుండా, మీ టీవీని AI-రెడీ వర్చువల్ కంప్యూటర్గా మార్చేస్తుంది.

ఇక ప్రత్యేకంగా కంప్యూటర్ కొనాల్సిన అవసరం లేదు. జియో సెట్‌టాప్ బాక్స్, జియోఫైబర్ లేదా జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్, కీబోర్డ్, మౌస్ ఇవన్నీ ఉంటే చాలు, మీ టీవీ ఫుల్ కంప్యూటర్‌గా మారిపోతుంది. డాక్యుమెంట్లు క్రియేట్ చేయాలా? ఆన్‌లైన్ క్లాసులు అటెండ్ కావాలా? లేక డిజైన్ వర్క్, ప్రోగ్రామింగ్ చేయాలా? ఇవన్నీ ఇక టీవీ స్క్రీన్ మీదే సాధ్యం.
"జియో పీసీ అంటే కేవలం కంప్యూటర్ కాదు. ఇది అందరికీ AI శక్తిని అందించే ఒక కొత్త వేదిక. ముందస్తు పెట్టుబడి లేకుండా వాడినంతకే చెల్లించే మోడల్‌తో, విద్యార్థులు నుంచి ప్రొఫెషనల్స్ వరకు అందరికీ ఇది గేమ్ ఛేంజర్ అవుతుంది," అన్నారు.
ఎలా పనిచేస్తుంది?
జియో పీసీ పూర్తిగా క్లౌడ్ ఆధారంగా నడుస్తుంది. అంటే CPU, స్టోరేజ్ అన్నీ మీ దగ్గర ఉండవు. అవన్నీ జియో సర్వర్లలో ఉంటాయి. మీరు స్క్రీన్, కీబోర్డ్, ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తే చాలు.
ఈ సిస్టమ్ ఎప్పటికప్పుడు అప్‌డేట్, సెక్యూర్, అలాగే అవసరమైతే స్టోరేజ్, మెమరీని పెంచుకునే సౌకర్యం కూడా కలిగి ఉంటుంది. హార్డ్‌వేర్ పాతబడిపోతుంది అనే టెన్షన్ ఉండదు.
ప్లాన్స్ ఎంత?
రిలయన్స్ ఈ సర్వీస్‌ను చాలా తక్కువ ఖర్చుతో అందిస్తోంది. నెలకు రూ. 599 ప్లాన్ (8GB RAM, 100GB స్టోరేజ్) నుంచి మొదలవుతుంది. రెండు నెలలు, ఆరు నెలలు, ఒక ఏడాది ప్లాన్స్ కూడా ఉన్నాయి. లాంగ్-టర్మ్ ప్లాన్స్‌కి అదనంగా ఫ్రీ నెలలు కూడా ఇస్తున్నారు.
టెక్నికల్ డిటేల్స్
జియో పీసీ 4-కోర్ CPU, 8GB RAM, 100GB క్లౌడ్ స్టోరేజ్, Ubuntu OS పై నడుస్తుంది. సాదా బ్రౌజింగ్ నుంచి డిజైన్ వర్క్ వరకు ఈ సెట్ అప్ సపోర్ట్ చేస్తుంది. అదనంగా AI టూల్స్, ప్రీ-లోడెడ్ అప్లికేషన్ లైబ్రరీ త్వరలో అందించనున్నారు.
జియోపీసీ విద్యార్థులకు, వర్క్ ఫ్రం హోమ్ చేసేవారికి అసలు బంగారంలా ఉపయోగపడే సొల్యూషన్. ల్యాప్‌టాప్ కొనలేని పిల్లలు ఇప్పుడు గ్రామాల్లో కూడా టీవీ మీదే ఆన్‌లైన్ క్లాసులు అటెండ్ అవ్వొచ్చు. ప్రాజెక్టులు చేయాలి, కోడింగ్ నేర్చుకోవాలి, ప్రెజెంటేషన్లు తయారు చేయాలి ఇవన్నీ ఇక 30-40 వేల ఖర్చు పెట్టకుండా సాధ్యమవుతుంది. అదే విధంగా ప్రొఫెషనల్స్‌కి కూడా ఇది లైఫ్ ఈజీ చేస్తుంది. ఇంట్లో సాధారణ టీవీ ఉంటే చాలు, వర్క్ ఫ్రం హోమ్ సెట్ అయిపోతుంది. ఫైళ్లు మొత్తం క్లౌడ్‌లోనే ఉండటంతో, ల్యాప్‌టాప్ క్రాష్ అయిందా, హార్డ్‌డ్రైవ్ పోయిందా అనే టెన్షన్ కూడా ఉండదు.
జియో పీసీతో కంప్యూటర్ అంటే ఇక CPU, ల్యాప్‌టాప్ అనే లగ్జరీ కాదు. టీవీ ఉన్న ప్రతి ఇంట్లో కంప్యూటింగ్ శక్తి అందుబాటులోకి వస్తోంది. తక్కువ ఖర్చు, ఎక్కువ సౌలభ్యం ఇదే రిలయన్స్ చూపిస్తున్న కొత్త దారి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications