షాపింగ్ ఇక స్టార్ట్ చేయండి! ఏపీ, తెలంగాణల్లో ఈ నగరాల్లో జియోమార్ట్
తెలుగు రాష్ట్రాల్లో కిరాణా వస్తువులను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు రిలయన్స్ రిటైల్ జియో మార్ట్ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 30 పట్టణాలు, నగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ సదుపాయాలను కల్పిస్తున్నట్లు రిలయన్స్ రిటైల్ తెలిపింది. కస్టమర్లు జియోమార్ట్ వెబ్ సైట్ ద్వారా తమకు కావాల్సిన వస్తువులను ఆర్డర్ చేయవచ్చు.

30 నగరాలు, పట్టణాల్లో..
పళ్లు, కూరగాయలు, నూనెలు, పప్పులు, కూల్ డ్రింక్స్ వంటి వివిధ రకాలైన వస్తువులను అందుబాటులోకి తెచ్చింది. గరిష్ట చిల్లర ధర కంటే రూ.5 శాతం డిస్కౌంటుకు అన్ని రకాలైన ఉత్పత్తులను అందిస్తున్నట్లు తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద నగరాలు, చిన్న పట్టణాలలో ప్రజలకు నిత్యావసర వస్తువులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే సౌకర్యాన్ని శనివారం నాడు ప్రారంభించింది. మొత్తం 30 పట్టణాల్లో జియో మార్ట్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ తెలిపింది.

తెలంగాణలోని ఈ పట్టణాల్లో...
తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, బోధన్, ఖమ్మం, పాల్వంచ, మిర్యాలగూడ, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డిలలో జియో మార్ట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ పట్టణాలలో
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, చిత్తూరు, కాకినాడ, గుంటూరు, తిరుపతి, తాడేపల్లిగూడెం, తణుకు, కర్నూలు, వినుకొండ, ఉయ్యూరు, అనంతపురం, నర్సారావుపేట, భీమవరం, విజయనగరం పట్టణాల్లో జియో మార్ట్ సేవలు అందుబాటులో ఉంటాయి.

షాపింగ్ ఇక స్టార్ట్ చేయండి!
www.jiomart.com వెబ్ సైట్ ఓపెన్ చేయగానే మీకు ఎక్కడ డెలివరీ చేయాలని అనే పాపప్ వస్తుంది. అక్కడ పిన్ కోడ్ అడుగుతుంది. పిన్ కోడ్ ఎంటర్ చేస్తే అక్కడ ప్రస్తుతం సర్వీస్ ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది. మీరు ఎంటర్ చేసిన పిన్ కోడ్‌లో జియోమార్ట్ సేవలు అందుబాటులో లేకుంటే ప్రస్తుతానికి ఈ సేవలు లేవని చెబుతుంది. జియోమార్ట్ సేవలు ఉంటే అందుబాటులో ఉంటే మాత్రం షాపింగ్ స్టార్ట్ చేయండి అని ఉంటుంది. ఆపర్లు, డిస్కౌంట్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications