రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆన్‌లైన్ కన్స్యూమర్ గ్రాసరీ ప్లాట్‌ఫామ్ జియోమార్ట్-యాప్ గూగుల్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, ఐవోఎస్ యాప్ స్టోర్‌లలోను అందుబాటులో ఉంది. షాపింగ్ కేటగిరీలో ఆపిల్ యాప్ స్టోర్ డౌన్‌లోడ్‌లలో రెండో స్థానంలో, గూగుల్ ప్లే స్టోర్‌లో మూడో స్థానంలో ఉంది. గూగుల్ ప్లే స్టోర్‌లో 10 లక్షల డౌన్‌లోడ్స్ పూర్తయ్యాయి. జియో మార్ట్ బీటా ప్లాట్‌ఫామ్ ఈ ఏడాది మార్చి నాటికి 200 నగరాలు, పట్టణాల్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆర్డర్స్ రోజు రోజుకు వేగంగా పెరుగుతున్నాయి.

ఆర్డర్స్ పరిమితి లేకుండా ఉచిత డెలివరీ
రిలయన్స్ రిటైల్ ప్లాట్‌ఫామ్ జియోమార్ట్ డౌన్‌లోడ్‌లలో దూసుకెళ్తోంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్ల కోసం లాంచ్ చేసిన కొద్ది సమయంలోనే ఈ యాప్ 10 లక్షలకు పైగా డౌన్‌లోడ్స్ పూర్తయ్యాయి. యాప్ బ్రెయిన్ డేటా ప్రకారం గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్స్‌లలో వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ షాపింగ ప్లాట్‌ఫామ్ జియోమార్ట్ దేశవ్యాప్తంగా రోజువారీ రెండున్నర లక్షలకు పైగా ఆర్డర్స్ పొందుతున్నాయి. ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించేందుకు ఆర్డర్ పరిధితో నిమిత్తం లేకుండా ఉచిత డెలివరీ అందిస్తోంది. అలాగే చెల్లింపుల్లో సోడెక్సో మీల్ కూపన్స్ అంగీకరిస్తోంది. దీంతో జియోమార్ట్‌కు భారీ ఆదరణ లభిస్తోందని చెబుతున్నారు.

5 శాతం డిస్కౌంట్
జియోమార్ట్ సేవలు పలు టైర్ 2, టైర్ 3 నగరాల్లోను అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లకు గ్రాసరీస్, ఫ్రూట్స్, కూరగాయలు, నిత్యావసర వస్తువులు సహా వివిధ ఐటమ్స్ హోమ్ డెలివరీ అందుబాటులో ఉంది. జియోమార్ట్ కస్టమర్లకు అవసరమైన కొత్త కొత్త ఉత్పత్తులను ఎప్పటికి అప్పుడు జత చేస్తోంది. కొత్త ఉత్పత్తులు, ఫీచర్లు, బ్రాండ్స్ పరిచయం చేస్తూ కస్టమర్లకు కొత్త అనుభూతులు ఇస్తోంది. పర్సనల్ కేర్ ఉత్పత్తులు, హోమ్, కిచెన్ కేర్ ప్రోడక్ట్స్, పూజా వస్తువులు, షూకేర్, బేబీ కేర్ ఉత్పత్తులు, బ్రాండెడ్ ఫుడ్ ఐటమ్స్ వంటివి అందుబాటులో ఉంటాయి. ఉత్పత్తులపై 5 శాతం డిస్కౌంట్ అందిస్తున్నాయి.

చెల్లింపులు
వినియోగదారులు తమకు ఇష్టమైన మోడ్‌లో చెల్లింపులు చేయవచ్చు. కస్టమర్లను పెంచుకోవడం కోసం కనీస ఆర్డర్ నిబంధనలు లేకుండా ఉచితంగా సేవలు అందిస్తోంది. ఇటీవలి వరకు వెబ్ సైట్, వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉన్న సేవలు, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కస్టమర్లకు ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారులకు గూగుల్ ప్లే, యాపిల్ స్టోర్ నుంచి జియో మార్ట్ యాప్ డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. రిలయన్స్, ఫేస్ బుక్ భాగస్వామ్యం ద్వారా మార్కెట్ లీడర్ ఎదుగుతామని, 2024 నాటికి గ్రాసరీ స్పేస్‌లో 50 శాతం వాటాను దక్కించుకుంటామని జియోమార్ట్ ధీమాగా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications