మీరు జియో హాట్‌స్టార్‌లో సినిమాలు లేదా క్రికెట్ చూస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం జియో హాట్ స్టార్ (JioHotstar) తన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 28, 2026 నుండి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా సూపర్, ప్రీమియం ప్లాన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. అయితే సామాన్య యూజర్ల కోసం కంపెనీ కొన్ని కొత్త నెలవారీ (Monthly) ప్లాన్లను కూడా ప్రవేశపెట్టింది.

జియో హాట్‌స్టార్ కొత్త ప్లాన్ల వివరాలు (జనవరి 28, 2026 నుండి)..
- మొబైల్ ప్లాన్ (Mobile): నెలవారీ ప్లాన్: రూ.79 (ఇది కొత్తగా ప్రవేశపెట్టిన ప్లాన్).
- సూపర్ ప్లాన్ (Super): నెలవారీ ప్లాన్: రూ.149 (ఇది కూడా కొత్తగా అందుబాటులోకి వచ్చింది).
- త్రైమాసిక ప్లాన్ (3 నెలలు): పాత ధర రూ.299 నుండి రూ.349కి పెరిగింది.
- వార్షిక ప్లాన్ (1 సంవత్సరం): పాత ధర రూ.899 నుండి రూ.1,099కి పెరిగింది.
- ప్రీమియం ప్లాన్ (Premium): త్రైమాసిక ప్లాన్ (3 నెలలు): పాత ధర రూ.499 నుండి రూ.699కి పెరిగింది.
- వార్షిక ప్లాన్ (1 ఏడు): పాత ధర రూ.1,499 నుండి రూ.2,199కి భారీగా పెరిగింది.
ఇకపోతే హాలీవుడ్ కంటెంట్ ఇప్పుడు సూపర్, ప్రీమియం యూజర్లకు మాత్రమే ప్లాన్‌లో భాగంగా లభిస్తుంది. మొబైల్ యూజర్లు హాలీవుడ్ సినిమాలు చూడాలంటే విడిగా డబ్బులు చెల్లించి యాడ్-ఆన్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఎందుకు ఈ ధరల పెంపు?
కస్టమర్లు కంటెంట్ ను చూసే విధానం మారుతోందని కంపెనీ పేర్కొంది. ఇప్పుడు చాలా మంది మొబైల్ కంటే టీవీల్లో లేదా మల్టీ డివైజ్‌లలో చూడటానికి ఇష్టపడుతున్నారు. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని, మెరుగైన క్వాలిటీ, కంటెంట్ అందించడానికే ఈ ధరల సవరణ చేస్తున్నట్లు JioHotstar ప్రతినిధి సుశాంత్ శ్రీరామ్ తెలిపారు. సాధారణ జియో రీచార్జ్ ప్లాన్లతో వచ్చే బెనిఫిట్స్ కాకుండా, నేరుగా యాప్ లో తీసుకునే సబ్‌స్క్రిప్షన్లపై ఈ ప్రభావం ఉంటుంది.
మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్!
మొబైల్ యూజర్ల కోసం కంపెనీ కొత్తగా రూ.79 నెలవారీ ప్లాన్ ను తీసుకొచ్చింది. అలాగే మొబైల్ త్రైమాసిక, వార్షిక ప్లాన్ల ధరలలో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే, హాలీవుడ్ కంటెంట్ చూడాలనుకునే మొబైల్ యూజర్లు ఇకపై అదనపు పేమెంట్ (Add-on) చేయాల్సి ఉంటుంది. కొత్తగా సూపర్ లేదా ప్రీమియం ప్లాన్ తీసుకునే వారికి మాత్రం హాలీవుడ్ కంటెంట్ ఉచితంగా లభిస్తుంది.
పాత సబ్‌స్క్రైబర్ల పరిస్థితి ఏంటి?
మీరు ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ తీసుకుని ఉంటే కంగారు పడక్కర్లేదు. మీ ఆటో రెన్యూవల్ (Auto-renewal) యాక్టివ్ గా ఉంటే, మీరు పాత ధరకే సేవలను కొనసాగించవచ్చు. కానీ, కొత్తగా సబ్‌స్క్రిప్షన్ తీసుకునే వారు లేదా ప్లాన్ మారే వారు మాత్రం కొత్తగా పెరిగిన ప్లాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఏదేమైనా పెరుగుతున్న కంటెంట్ డిమాండ్, క్వాలిటీని బట్టి ఈ మార్పులు అనివార్యమని కంపెనీ అంటోంది. మీరు తక్కువ ధరలో హాట్‌స్టార్ చూడాలనుకుంటే.. జనవరి 28 లోపే ప్లాన్ రిన్యూవల్ చేసుకోవాలి లేదా మీకు నచ్చిన మొబైల్ ప్లాన్ తో రీచార్జ్ చేసుకోవాలి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications