Jiohotstar News: దేశంలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ ప్రముఖ పారిశ్రామికవేత్త అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్. అయితే తాజాగా రిలయన్స్ గ్రూప్ నుండి ఒక పెద్ద వార్త వినిపిస్తుంది. ఏంటంటే జియోహాట్‌స్టార్ అనే కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ రాబోతుంది. దీనిని JioCinema ఇంకా Disney+Hotstar కలిపి తీసుకొస్తున్నారు. దీని ద్వారా జియోహాట్‌స్టార్ భారతదేశపు అతిపెద్ద OTT ప్లాట్‌ఫామ్‌గా మారుతుందని చెబుతున్నారు. దీనికి 50 కోట్లకు పైగా కస్టమర్లు, 3 లక్షల గంటలకు పైగా కంటెంట్ ఉంటుందని అంచనా. ఈ వార్త స్టాక్ మార్కెట్లో పడిపోతున్న రిలయన్స్ షేర్లకు కొత్త జీవం పోస్తుంది.
మరోవైపు జియో హాట్‌స్టార్‌లో క్రికెట్ చూడటం ఒక విభిన్నమైన అనుభవంగా ఉంటుందని చెబుతున్నారు. మీరు జియో హాట్‌స్టార్‌లో పెద్ద ICC ఈవెంట్‌లు, IPL, WPL ఇంకా ఇతర టోర్నమెంట్‌లను కూడా చూడవచ్చు. ఇది మాత్రమే కాదు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్, వింబుల్డన్, ప్రో కబడ్డీ లీగ్, ISL వంటి ఇతర స్పోర్ట్స్ కూడా ఈ యాప్స్'లో ఉంటాయి. స్పోర్ట్స్ ప్రియులకు ఇది ఒక మంచి గిఫ్ట్ లాంటిది!

2023 నుండి $3 బిలియన్లకు పాపులర్ టోర్నమెంట్ హక్కులను పొందినప్పటి నుండి జియో సినిమా ఐదు సంవత్సరాల పాటు ఫ్రీ IPL స్ట్రీమింగ్ అందించింది. కానీ 2025 నుండి స్పోర్ట్స్ లవర్స్ ఇక మొత్తం లైవ్ మ్యాచ్ లేదా ఏదైనా స్పోర్ట్స్ చూడటానికి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే.
కొన్ని కొత్త ఫీచర్లు కూడా
జియో హాట్‌స్టార్ ఈ యాప్ కొత్త ఫీచర్లతో వస్తుంది. అల్ట్రా HD 4K స్ట్రీమింగ్, మల్టీ-యాంగిల్ వ్యూయింగ్, AI- పవర్డ్ ఇన్‌సైట్స్ ఇంకా రియల్-టైమ్ స్టాట్స్ ఓవర్‌లే వంటి ఫీచర్లు మీకు మరింత అనుభవాన్ని అందిస్తాయి. 4K స్ట్రీమింగ్ అంటే మీరు స్టేడియంలో మ్యాచ్ చూస్తున్నట్లుగా, క్రిస్టల్-క్లియర్ ఇంకా మల్టి యాంగిల్ వ్యూ మీరు మ్యాచ్‌ను వివిధ కోణాల నుండి చూడవచ్చు.
రెండు రకాల ప్లాన్లు
జియో హాట్‌స్టార్ రెండు రకాల ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఒకటి ఫ్రీ ఇందులో యాడ్స్ ఉంటాయి. ప్రీమియం ప్లాన్స్ రూ.149 నుండి ప్రారంభమవుతాయి. మీరు ఇప్పటికే డిస్నీ+ హాట్‌స్టార్ లేదా జియో సినిమా ఉపయోగిస్తుంటే మీ అకౌంట్ కొత్త ప్లాట్‌ఫామ్‌కి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. మీరు ఏమీ చేయనవసరం లేదు ప్రతిదీ ఆటోమేటిక్'గా జరుగుతుంది.
కొత్త పేరు మార్పు
ఈ మార్పు ఇప్పటికే ప్రారంభమైంది. గూగుల్ ప్లే స్టోర్ ఇంకా ఆపిల్ యాప్ స్టోర్‌లోని డిస్నీ+ హాట్‌స్టార్ యాప్ పేరును జియో హాట్‌స్టార్‌గా మార్చారు. హాట్‌స్టార్ వెబ్‌సైట్ ఇప్పుడు మిమ్మల్ని కొత్త సర్వీస్ కి దారి మళ్లిస్తుంది, ఇందులో జియో సినిమా నుండి కంటెంట్ కూడా ఉంటుంది. గత ఏడాది ఆగస్టులో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) అండ్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) డిస్నీ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ విలీనానికి ఆమోదం తెలిపాయి. ఈ జాయింట్ వెంచర్ నవంబర్‌లో ప్రారంభమైంది. రిలయన్స్ 60% వాటాతో ఉండగా, డిస్నీ 37% వాటాతో ఉంది.
పెరిగిన రిలయన్స్ షేర్లు.
ఈ వార్త వెలువడిన వెంటనే, స్టాక్ మార్కెట్లో రిలయన్స్ షేర్లు పెరిగాయి. నిన్న దాని షేర్లు రూ.1216.20 వద్ద క్లోజ్ అయ్యాయి. ఈరోజు ఉదయం BSEలో రూ.1220.00 వద్ద ప్రారంభమైంది. కొద్దిసేపటికే రూ.1224.30కి పెరిగింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications