అద్భుతమైన ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న టెలికం ఆపరేటర్ రిలయన్స్ జియో తాజాగా జియో ఫైబర్ కస్టమర్లకు మరో బంపరాఫర్ తీసుకు వచ్చింది. రూ.999తో అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. జియో ఫైబర్ గోల్డ్, అంతకుమించి ప్లాన్‌లో ఉన్న జియో ఫైబర్ కస్టమర్లకు ఇది అందుబాటులో ఉంటుంది. అమెజాన్ సభ్యత్వం వల్ల జియో ఫైబర్ యూజర్లు ఏమేం పొందుతారంటే...
- జియో ఫైబర్ యూజర్లు 'గులాబో సితాబో' సినిమాను వీక్షించవచ్చు.
- ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఆస్వాదించవచ్చు.... అమెజాన్ ప్రైమ్ వీడియో (హిందీ, మరాఠీ, తమిళం, మలయాళం, గుజరాతీ, తెలుగు, కన్నడ, పంజాబీ, బెంగాళీ), ఉచితంగా, వేగవంతమైన డెలివరీ, టాప్ డీల్స్‌కు ముందే యాక్సెస్, ప్రైమ్ ఆడ్-ఫ్రీ మ్యూజిక్, ప్రైమ్ గేమింగ్, ప్రైమ్ రీండింగ్ ఉన్నాయి.
- అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ జియోఫైబర్ గోల్డ్, అంతకు మించిన ప్లాన్స్ బైన అందుబాటులో ఉన్నాయి.

ప్రయోజనం ఇలా
- పాత, కొత్త గోల్డ్ కస్టమర్లకు ఈ ఆఫర్స్ వర్తిస్తాయి. ఈ ఆఫర్ పొందేందుకు జియో ఫైబర్ గోల్డ్ లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్ రీచార్జ్ చేసుకోవాలి. లేదా పాత ప్లాన్ అప్ గ్రేడ్ చేసుకొని ఈ ప్రయోజనం పొందవచ్చు.

ఉచిత ప్రైమ్ సభ్యత్వం ఇలా సులభం
మూడు సింపుల్ స్టెప్స్‌లలో ప్రైమ్ సభ్యత్వం పొందవచ్చు
- జియో ఫైబర్ గోల్డ్ లేదా అంతకుమించి ప్లాన్ రీచార్జ్ చేసుకోవాలి.
- మైజియో యాప్ లేదా జియో డాట్ కామ్ ద్వారా జియో ఫైబర్ ఖాతాకు లాగిన్ కావాలి.
- ఏడాది అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ బ్యానర్ పైన క్లిక్ చేసి, అమెజాన్ ప్రైమ్ ఖాతాకు సైన్-ఇన్ కావాలి.

జియో ఫైబర్ గోల్డ్ ప్లాన్స్ ప్రయోజనాలు
- 250 Mbps డేటా స్పీడ్
- నెలకు 1750 GB డేటా వరకు అపరిమిత ఇంటర్నెట్
- అపరిమిత వాయిస్ కాల్స్
- అపరిమిత వీడియో కాలింగ్ అండ్ కాన్ఫరెన్సింగ్ (టీవీ వీడియో కాలింగ్ సౌకర్యం కూడా ఉంది)
- ఇతర జియో యాప్స్‌కు అన్ లిమిటెడ్ యాక్సెస్


Click it and Unblock the Notifications