జియో ఫైబర్ అదిరిపోయే ఆఫర్. జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ విభాగంలో వినియోగదారులను ఆకర్షించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నది. ఎంట్రీ ఫీజుతో పాటు ఇన్‌స్టలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. అంతేకాదు, ఈ విభాగంలో కొత్త పథకాలను తీసుకువచ్చింది. కొత్తగా జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ సేవలను ఎంపిక చేసుకునే వారికి రూ.10వేలు విలువ చేసే ఇంటర్నెట్ బాక్స్, సెట్-టాప్ బాక్స్, వీటి ఇన్‌స్టలేషన్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు జియో ప్రకటించింది.
సబ్‌స్క్రైబర్లకు నెలకు రూ.399, రూ.699 ప్రత్యేక ఇంటర్నెట్ పథకాలను తీసుకు వచ్చింది. వీటితో పాటు రూ.100 అదనంగా చెల్లిస్తే ఆరు ఎంటర్‌టైన్మెంట్ యాప్స్, రూ.200 చెల్లిస్తే 14 అదనపు ఎంటర్‌టైన్మెంట్ యాప్స్‌ను పొందవచ్చు. రూ.599 చెల్లించడం ద్వారా అన్-లిమిటెడ్ ఇంటర్నెట్ (30 Mbps) స్పీడ్, 14 ఓటీటీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. మూడు నెలలకు ఓసారి కాకుండా ప్రతి నెల పోస్ట్ పెయిడ్ బిల్లు చెల్లించే అవకాశాన్ని తీసుకు వచ్చింది.

ఫిక్స్డ్ లైన్ బ్రాడ్ బ్యాండ్ సేవల విభాగంలో కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో జియో ముందు ఉన్నది. కస్టమర్ల సంఖ్యాపరంగా దాదాపు దశాబ్దాలుగా అగ్రస్థానంలో ఉన్న బీఎస్ఎన్ఎల్‌ను వెనక్కి నెట్టి, గత నవంబర్ నెలలో జియో మొదటి స్థానానికి చేరుకున్నది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications