For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్రప్రదేశ్‌లో మరో 3 పట్టణాల్లో జియో ఫైబర్ సేవలు: జియో ఫైబర్ 4 ప్లాన్లు ఇవే..

|

జియో ఫైబర్ తన హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు పట్టణాలకు విస్తరించింది. తెనాలి, హిందూపూర్, బొబ్బిలిలలో ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 26 పట్టణాల్లో జియో ఫైబర్ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లయింది. ఇప్పటికే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ఏలూరు, ఒంగోలు, విజయనగరం, శ్రీకాకుళం తదితర పట్టణాల్లో వినియోగదారులు జియో ఫైబర్ సేవలను ఆస్వాదిస్తున్నారు.

'నయే ఇండియా కా నయా జోష్'

'నయే ఇండియా కా నయా జోష్'

'మొబైల్ కనెక్టివిటీపరంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే జియో వేగంగా, విస్తృతంగా దూసుకువెళ్లి నెంబర్ వన్ ఆపరేటర్‌గా నిలిచింది. ఇదే పరుగును బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ రంగంలో కూడా కొనసాగించి జియో ఫైబర్‌ను ఈ పట్టణాల్లో ప్రతీ ఇంటికి తీసుకెళ్లి, ఆ ఇంట్లో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకుంటున్నామ'ని జియో ఆంధ్రప్రదేశ్ సీఈఓ మండపల్లి మహేష్ కుమార్ అన్నారు.

'నయే ఇండియా కా నయా జోష్' పేరుతో జియో సరికొత్త ప్లాన్స్ ప్రకటించింది. ఈ ప్లాన్స్ రూ.399 నుంచి ప్రారంభమౌతాయి. అపరిమిత డేటా వాడుకోవచ్చు. అంతేకాదు 150Mbps స్పీడ్‌తో 30 రోజుల ఉచిత ట్రయల్ కూడా ఆఫర్ చేస్తోంది. 4K సెట్ టాప్ బాక్స్ ఉచితం. కొత్త యూజర్లకు 10 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 30 రోజుల ఫ్రీ ట్రయల్‌లో భాగంగా 10 ఓటీటీ యాప్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. వాయిస్ కాలింగ్ ఉచితం. ఒకవేళ 30 రోజుల్లో సర్వీస్ నచ్చకపోతే కనెక్షన్ వద్దని చెప్పవచ్చు ఎలాంటి షరతులు లేవు. ఈ 30 రోజుల ఫ్రీ ట్రయల్ కొత్త కస్టమర్లకు మాత్రమే.

జియో ఫైబర్ కస్టమర్లకు లాయల్టీ బెనిఫిట్స్

జియో ఫైబర్ కస్టమర్లకు లాయల్టీ బెనిఫిట్స్

ఇప్పటికే జియోఫైబర్ కస్టమర్లుగా ఉన్నవారికి కూడా లాయల్టీ బెనిఫిట్స్ లభిస్తాయి. కొత్త టారిఫ్ ప్లాన్స్ ప్రకారం ప్రస్తుత కస్టమర్లను అప్‌గ్రేడ్ చేసి ఆయా ప్రయోజనాలను అందిస్తారు.

https://www.jio.com/registration ద్వారా కస్టమర్లు నమోదు చేసుకోవచ్చు.

కొత్తగా ప్రకటించిన జియో ఫైబర్ 4 ప్లాన్ల వివరాలివి...

కొత్తగా ప్రకటించిన జియో ఫైబర్ 4 ప్లాన్ల వివరాలివి...

JioFiber Rs 399 Plan: జియోఫైబర్ రూ.399 ప్లాన్ తీసుకుంటే 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం.

JioFiber Rs 699 Plan: జియోఫైబర్ రూ.699 ప్లాన్ తీసుకుంటే 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం.

JioFiber Rs 999 Plan: జియోఫైబర్ రూ.999 ప్లాన్ తీసుకుంటే 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రూ.1000 విలువైన 11 ఓటీటీ యాప్స్ సబ్‍స్క్రిప్షన్స్ ఉచితం.

JioFiber Rs 1499 Plan: జియోఫైబర్ రూ.1499 ప్లాన్ తీసుకుంటే 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రూ.1500 విలువైన 12 ఓటీటీ యాప్స్ సబ్‍స్క్రిప్షన్స్ ఉచితం.

English summary

ఆంధ్రప్రదేశ్‌లో మరో 3 పట్టణాల్లో జియో ఫైబర్ సేవలు: జియో ఫైబర్ 4 ప్లాన్లు ఇవే.. | JioFiber naye india ka naya josh

Reliance JioFiber's naye india ka naya josh. Reliance JioFiber offers temporary 10 Mbps free-of-cost broadband connection.
Story first published: Thursday, December 3, 2020, 22:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X