టెలికాం రంగంలో సంచలనాలకు కేర్ ఆఫ్ అయిన కార్పోరేట్ దిగ్గజం రిలయన్స్ జియో ఇప్పుడు ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. ఆకర్షణీయమైన ఆఫర్ ఇస్తూ జియో ఫైబర్ బ్రాండ్ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. రిలయన్స్ జియో నుంచి కొత్త ప్లాన్ ను ట్రూలీ అన్ లిమిటెడ్ అంటూ లాంచ్ చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ నుండి జియో ఫైబర్ తన కొత్త వినియోగదారుల కోసం ఎలాంటి కండిషన్లు లేకుండా నెల రోజుల పాటు ట్రయల్ ను అందిస్తోంది.

నెలరోజుల పాటు ట్రూలీ అన్ లిమిటెడ్ ఇంటర్నెట్
సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్30 వ తేదీ వరకు ఎత్తున ఉచిత ట్రయల్ లో భాగంగా అన్ లిమిటెడ్ గా ఇంటర్నెట్ వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తుంది. కొత్త కస్టమర్లు మాత్రమే కాకుండా, వారితో పాటు ఆగస్టు 15, 31 మధ్య ప్లాన్ తీసుకున్న జియో ఫైబర్పాత కస్టమర్లకు కూడా30 రోజుల ఉచిత ట్రయల్ లభిస్తుంది. అలాగే999, 1499ప్లాన్లలో 1500 విలువైన 12 స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలను ఉచితంగా అందించనుంది. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్, జీ 5, సోనీ లివ్, లయన్స్ గేట్ ప్లే, ఆల్ట్ బాలాజీ వంటి స్ట్రీమింగ్ యాప్స్ కోసం4కే సెట్ టాప్ బాక్స్‌ను కూడా ఇవ్వనుంది.

ఎలాంటి కండిషన్స్ లేని 30 రోజుల జియో ఫైబర్ ట్రయల్
ఇక ఇప్పటి వరకు ఉన్న వినియోగదారులు కొత్త టారిఫ్ ల ప్రకారం ప్లాన్ల ప్రయోజనాలకు అనుగుణంగా అప్ గ్రేడ్ అవుతారు. ప్రస్తుత సమయంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ యొక్క అవసరాన్ని బట్టి, వినియోగదారులకు విశ్వసనీయమైన సేవలను అందించడం కోసం తాము ఈ ప్లాన్ ను తీసుకువచ్చామని ఒక ప్రకటనలో జియో ఫైబర్ తెలిపింది. ఈ కొత్త ప్లాన్ ప్రకారం జియో ఫైబర్ 30 రోజుల ఎలాంటి కండిషన్స్ లేని ఉచిత ట్రయల్ ను అందించడంతో పాటు గా, 150ఎంబీపీఎస్ అపరిమిత ఇంటర్నెట్ ను , ఫోర్ కే సెట్ అప్ బాక్స్ ను, ఉచిత ఒక వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని అందించనుంది. ఒకవేళ ఎవరికైనా ఈ ప్లాన్ నచ్చకపోతే ప్లాన్ ను ఉపసంహరించుకునే వెసులుబాటు కూడా జియో ఫైబర్ కల్పిస్తోంది.

జియో ఫైబర్ కొత్త ప్లాన్స్ ఇవే
ఇప్పటికే జియో టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించి ప్రత్యర్ధి కంపెనీలకు చుక్కలు చూపించింది. పోటీదారులకు టెన్షన్ పుట్టించింది. ఇప్పుడు ఫైబర్ నెట్ రంగంలోనూ దూసుకుపోతూ కమ్యూనికేషన్ రంగంలో సంచలనాలకు కేరాఫ్ గా మారనుంది . జియో ఫైబర్ అందించే కొత్త ప్లాన్స్ వివరాలను చూస్తే
399రూపాయల ప్లాన్ లో30 ఎంబీపీఎస్ స్పీడ్
, 699 రూపాయల ప్లాన్ లో100 ఎంబీపీఎస్స్పీడ్,
999రూపాయల ప్లాన్ లో150 ఎంబీపీఎస్స్పీడ్
, 1,499 రూపాయల ప్లాన్ లో 300 ఎంబీపీఎస్స్పీడ్ ఇవ్వనుంది .
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications