రిలయన్స్ జియో వైఫై కాలింగ్ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకు వచ్చింది. గత కొన్ని రోజులుగా టెస్టింగ్ దశలో ఉన్న ఈ సదుపాయాన్ని తాజాగా బుధవారం ప్రకటించింది. జనవరి 16వ తేదీ వరకు దశలవారీగా దీనిని దేశమంతా అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పింది. ఇప్పటికే ఈ ఫీచర్ కొందరికి అందుబాటులోకి వచ్చింది. వైఫై కాలింగ్ సేవలను ఉపయోగించి వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.
ఇటీవల ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ఫీచర్‌ను ప్రకటించింది. అయితే ఇది కొన్ని మొబైల్ మోడళ్లకే పరిమితమైంది. జియో వైఫై కాలింగ్ మాత్రం దాదాపు 150కి పైగా మోడల్స్‌లలో పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా వైఫై వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకుంటే కేవలం డేటా మాత్రం ఖర్చవుతుంది. కొద్ది నెలలుగా వీటిని పరీక్షిస్తున్న జియో జనవరి 8న ప్రారంభించింది. రానున్న ఎనిమిది రోజుల్లో క్రమంగా అంతటా అందుబాటులోకి వస్తుంది.

కస్టమర్లు ఏ వైఫై నెట్‌వర్క్‌ను అయినా ఉపయోగించుకొని జియో వైఫై కాలింగ్ చేసుకోవచ్చు. VoLTE లేదా వైఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్‌కు ఈజీగా మారవచ్చు. స్మార్ట్ ఫోన్‌లో వైఫై కాలింగ్ సదుపాయం ఉంటే సర్వీస్ ఉచితం. అయితే మీ ఫోన్‌కు వైఫై సపోర్ట్ చేస్తుందా లేదా తెలుసుకోవాలి. దీనికి జియో వెబ్ సైట్‌లోకి వెళ్లి చూడవచ్చు. వైఫై కాలింగ్ ఉపయోగించేందుకు కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది.
మొబైల్ నెట్ వర్క్ అందుబాటులో లేని సమయంలో ఫోన్ కాల్స్ చేసుకునేందుకు ఈ వైఫై కాలింగ్ సౌకర్యం ఎంతో ఉపయోగం. గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వర్క్ అప్పుడప్పుడు లేకుండా పోతుంది. అలాంటి సందర్భాల్లో ఇది ప్రయోజనం. దగ్గరలోని ఏ వైఫై నెట్ వర్క్ అయినా ఉపయోగించుకొని కాల్ చేసుకోవచ్చు. దీని కోసం అదనంగా ఎలాంటి రుసుము ఉండదు.


Click it and Unblock the Notifications