సొంత నెట్ వర్క్ పైన ఇతరుల నెంబర్‌కు రీచార్జ్ చేసే సౌలభ్యాన్ని రిలయన్స్ జియో తీసుకు వచ్చింది. జియోపీఓఎస్ లైట్ యాప్ సాయంతో సబ్‌స్క్రైబర్లు చేసే రీఛార్జ్ పైన దాదాపు 4 శాతం వరకు కమిషన్ పొందవచ్చునని తెలిపింది. లాక్ డౌన్ కారణంగా చాలామంది కస్టమర్లు రీఛార్జ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో జియో తాజా ప్రకటన చేసింది.

గూగుల్ ప్లే స్టోర్ నుండి
గూగుల్ ప్లే స్టోర్ నుండి జియోపీవోఎస్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఏ కస్టమర్‌కు అయినా రీఛార్జ్ చేయవచ్చు. మొదటిసారి వినియోగదారులు రూ.1000 బ్యాలెన్స్ ఉంచవలసి ఉంటుంది. జియో కస్టమర్ రీఛార్జ్‌లు చేసేందుకు జియో భాగస్వామి/జియో అసోసియేట్‌గా మారే అవకాశం ఈ యాప్ కల్పిస్తుంది. సులభ రీఛార్జ్‌తో పాటు కమీషన్ వస్తుంది.

భవిష్యత్తులోను ఉపయోగం
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ప్రజలు రీఛార్జ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికి రీఛార్జ్ చేయడానికి ఉపయోగపడటంతో పాటు భవిష్యత్తులో కూడా ఆన్‌లైన్ రీఛార్జీలు పెంచడమే జియో ఉద్దేశ్యంగా ఉంది. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ కస్టమర్లకు అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ఐవోఎస్ కస్టమర్లకు అందుబాటులోకి రానుంది.

ఇన్‌కమింగ్ కాల్ సేవలు పొడిగింపు
లాక్ డౌన్ సమయంలో తమ వారితో కాంటాక్ట్‌లో ఉండేందుకు గాను ఇన్‌కమింగ్ కాల్ సేవలను కూడా పొడిగించింది. అలాగే, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ అకౌంట్‌లను ఉపయోగించే టెక్స్ట్ సందేశాల ద్వారా ఫోన్లను రీఛార్జ్ చేసుకోగలరు. తద్వారా రీఛార్జ్ చేసుకోవడానికి ఇబ్బంది కలిగే వారికి ప్రయోజనం కల్పించడమే జియో లక్ష్యం. ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే, అమెజాన్ పే, మొబిక్విక్, ఫ్రీచార్జ్ తదితర థర్డ్ పార్టీల ద్వారా రీఛార్జ్ చేయవచ్చు.

వొడాఫోన్, ఎయిర్‌టెల్ దారిలోనే
భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు కరోనా మహమ్మారి లాక్ డౌన్ నేపథ్యంలో శుభవార్త అందించిన విషయం తెలిసిందే. ప్రీపెయిడ్ ఖాతాదారుల వ్యాలిడిటీ కాలపరిమితిని మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు నిన్న ప్రకటించాయి. రిలయన్స్ జియో కూడా అదే దారిలో నడిచింది.


Click it and Unblock the Notifications