Jio SpaceFiber: అంబానీ తన ఆలోచనలతో అందరికీ అందనంత వేగంగా పనిచేస్తున్నారు. టెలికాం రంగంలో ఇప్పటికే 5జీ సేవలతో ప్రపంచ రికార్డు సృష్టించిన అంబానీలు తాజాగా మరో రికార్డుకు సిద్ధమయ్యారు. దీనిని భారత ప్రధాని మోదీ పరిశీలించారు.
అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలకు ఇప్పటికే ఇండియాలో గుర్తింపు తెచ్చుకున్న రిలయన్స్ జియా నేడు తన జియో స్పేస్ ఫైబర్ సేవల నమూనాను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. దీనికి ముందు కంపెనీ తన జియో ఎయిర్ ఫైబర్ సేవలను దేశంలో లాంచ్ చేసింది. తాజాగా తీసుకొస్తున్న Jio SpaceFiber శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించనుంది. దీని ద్వారా కంపెనీ దేశంలో మారుమూల ప్రాంతాల్లో సైతం జియో ట్రూ5జీ సేవలను అందించాలనే లక్ష్యంతో దీనిని ప్రవేశపెట్టింది.

ఈ క్రమంలోనే రిలయన్స్ జియో భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహ ఆధారిత గిగాబిట్ బ్రాడ్‌బ్యాండ్ సేవను ప్రదర్శించింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఈ ప్రదర్శన జరిగింది. దేశంలో ప్రతి ఇంటికీ డిజిటల్ సేవలు అందుబాటులో ఉంచేలా చేసేందుకు జియో దీనిని వినియోగించనుంది. పైగా దీనిని పరీక్షించే క్రమంలో కంపెనీ గిర్ గుజరాత్, కోర్బా ఛత్తీస్‌గఢ్, నబ్రంగ్‌పూర్ ఒడిశా,ONGC-జోర్హాట్ అసోం ప్రాంతాల్లో సేవలను అందుబాటులో ఉంచింది. దీనికోసం జియో సరికొత్త మీడియం ఎర్త్ ఆర్బిట్(MEO) ఉపగ్రహ సాంకేతికతను SES సహకారంతో వాడుతోంది. ఈ సాంకేతికత జియోను అంతరిక్షం నుంచి గిగాబిట్, ఫైబర్ లాంటి సేవలను అందించడానికి అనుమతిస్తుంది.
ఈ సరికొత్త సేవలు దేశంలోని ప్రతి ఒక్కరిని విద్య, ఆరోగ్యం, వినోదం, ప్రభుత్వ సేవలను ఆన్ లైన్ ద్వారా పొందేందుకు వీలు కల్పిస్తుందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ అంబానీ అన్నారు. గిగాబిట్ యాక్సెస్‌తో ప్రతి ఒక్కరూ, ప్రతిచోటా, కొత్త డిజిటల్ సొసైటీలో పూర్తిగా మారేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. పైగా ఈ సాంకేతికత దేశంలోని లక్షల మంది గృహాలను, వ్యాపారులను మొదటిసారిగా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ పొందేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇది దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద డిజిటల్ పరివర్తనకు దారితీస్తుందని జియో ఆకాంక్షిస్తోంది.


Click it and Unblock the Notifications