జియో కాయిన్ రాబోతోందా ? పాలిగాన్ ల్యాబ్స్‌తో జియో టై- అప్.. సోషల్ మీడియాలో చెక్కర్లు..
భారతదేశపు నంబర్ వన్ ధనవంతుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో ప్లాట్‌ఫారమ్‌లు ఇటీవల పాలిగాన్ ల్యాబ్స్‌తో టై-అప్‌ను ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చినప్పటి నుండి JioCoin పేరు ఇంటర్నెట్‌లో చెక్కర్లు కొడుతుంది. అయితే దీనిపై జియో కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ చాలా మంది యూజర్లు X( గతంలో ట్విట్టర్)లో జియో కాయిన్ ఫోటోలను షేర్ చేయడం స్టార్ట్ చేసారు.
జియో ప్లాట్‌ఫారమ్‌లు, పాలిగాన్ ల్యాబ్‌ల సహాయంతో వెబ్3 అండ్ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీలను ప్రస్తుత సర్వీసుల్లోకి చేర్చాలని యోచిస్తోంది. ఈ రెండిటి కూటమిని ప్రకటించినప్పటి నుండి బహుశా JioCoin లాంచ్ కాబోతుందా ? అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. అయితే దీనిపై జియో ఎలాంటి ప్రకటన చేయలేదు.

బిట్నింగ్ సీఈవో కాషిఫ్ రజా కూడా ఈ విషయాన్ని షేర్ చేసారు. రిలయన్స్ గ్యాస్ స్టేషన్‌లో మొబైల్ రీఛార్జ్‌లు అలాగే సర్వీసుల కోసం JioCoins ఉపయోగించవచ్చని ఆయన చెప్పారు. కొత్త సేవలు ఇంకా అప్లికేషన్లు: ఈ కొత్త టై- అప్ తో జియో ప్రస్తుత సేవలైన టెలికాం, డిజిటల్ సేవలు, ఫైనాన్స్ మొదలైన వాటికి వెబ్3 ఫీచర్లను జోడిస్తుంది. దీని ద్వారా సురక్షితమైన డేటా ట్రాన్స్ఫర్ ఇంకా కొత్త రకాల డిజిటల్ సేవలను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది.
అలాగే ఈ టై- అప్ ద్వారా వెబ్3 ఫీచర్లు ఇప్పటికే ఉన్న కొన్ని అప్లికేషన్‌లు అండ్ జియో ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అందించే సేవలలో కూడా ఉపయోగించబడతాయి. జియోకి చెందిన 450 మిలియన్లకు పైగా కస్టమర్లకు వినూత్న సేవలను అందించడానికి ప్రముఖ టెక్నాలజీ అయిన బ్లాక్‌చెయిన్‌ను ఉపయోగించేందుకు పాలీగాన్ సిద్ధంగా ఉంది.
బ్లాక్‌చెయిన్, స్మార్ట్ కాంట్రాక్ట్‌లు, డిజిటల్ ఆస్తులు, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలు ఇంకా NFTలతో సహా క్రిప్టోకరెన్సీలు Web3 అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. క్రిప్టోకరెన్సీ అండ్ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీలో ప్రముఖ కంపెనీలలో పాలిగాన్ ల్యాబ్స్ ఒకటి. ఈ టై- అప్ క్రిప్టో పరిశ్రమలోకి ప్రవేశించడానికి జియోకు అవకాశం ఇస్తుందని కూడా భావిస్తున్నారు. జియో డిజిటల్ ప్రయాణంలో ఈ టై- అప్ ఒక ప్రధాన మైలురాయి అని జియో ప్లాట్‌ఫారమ్‌ల సిఇఒ కిరణ్ థామస్ అన్నారు.


Click it and Unblock the Notifications