For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను పునరుద్ధరించిన రిలయన్స్ జియో

|

ప్రముఖ టెల్కో రిలయన్స్ జియో తన దీర్ఘకాల ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఒకదానిని పునరుద్ధరించింది. ఈ మేరకు శనివారమే ప్రకటన చేసింది. రూ.4,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను తిరిగి తీసుకు వస్తున్నట్లు తెలిపింది. రిలయన్స్ దీర్ఘకాల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లలో ఇప్పుడు మూడు ఉన్నాయి. ఇందులో రూ.1,299, రూ.2,121 ఉన్నాయి. రూ.4,999 పునరుద్ధరతో మూడు అయ్యాయి.

రూ.4,999 ప్లాన్ కాలపరిమితి 360 రోజులు. 350GB డేటా, జియో నుంచి జియోకు అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యం, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు వంటి ప్రయోజనాలు ఉన్నాయి. జియో నుంచి ఇతర నెట్‌వర్క్స్‌కు 12,000 నిమిషాలు ఉంటాయి. జియో యాప్ కాంప్లిమెంటరీ ఆప్షన్ ఉంది. 350GB ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ఈ డేటా పూర్తయ్యాక స్పీడ్ 64 Kbpsకు తగ్గుతుంది.

Russia-Saudi price war: రష్యాతో సౌదీ ఆరామ్‌కో చమురు యుద్ధం, భారత్‌కు ఎప్పుడు, ఎలా ప్రయోజనం?Russia-Saudi price war: రష్యాతో సౌదీ ఆరామ్‌కో చమురు యుద్ధం, భారత్‌కు ఎప్పుడు, ఎలా ప్రయోజనం?

Jio Rs.4,999 Long Term Prepaid Plan Returns

గడువు ముగిసే వరకు 64 Kbpsతో యూజర్లు ఇంటర్నెట్‌ను ఉచితంగానే బ్రౌజ్ చేయవచ్చు. కానీ ఇది కేవలం బేసిక్ అవసరాలకు మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే వాట్సాప్ సందేశాలు పంపించడం, యాప్స్ సందేశాలకు మాత్రమే ఉపయోగపడుతుంది.

జియో రూ.1,299 ప్లాన్ కాలపరిమితి 336 రోజులు. 24GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. గతంలో ఈ ప్లాన్ కాలపరిమితి 365 రోజులుగా ఉండగా, గత నెలలో దీనిని 336 రోజులకు తగ్గించింది. రూ.2,121 ప్రీపెయిడ్ కాలపరిమితి 336 రోజులు. రోజుకు 1.5GB హైస్పీడ్ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.

English summary

లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను పునరుద్ధరించిన రిలయన్స్ జియో | Jio Rs.4,999 Long Term Prepaid Plan Returns

Reliance Jio, the leading telecom company in India, has revamped one of its long term prepaid plans in India.
Story first published: Tuesday, March 10, 2020, 15:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X