టెలికం రంగంలో దూసుకెళ్తున్న రిలయన్స్ జియో సరికొత్త జియో పోస్ట్ పెయిడ్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. మొబైల్ ఫోన్ వినియోగరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు రావడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. జియో నుండి తాజా పోస్ట్ పేయిడ్ మొబైల్ ప్లాన్స్, మంచి ధర ప్లాన్స్, ఇంటర్నేషనల్ కాల్స్, రోమింగ్ ప్రయోజనాలు, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఫ్యామిలీ బండిల్డ్ ప్లాన్స్ ఉన్నాయి. జియో పోస్ట్ పెయిడ్‌ప్లస్ విభాగాల్లో పలు ఆఫర్లు ప్రకటించింది. ఎంటర్టైన్మెంట్, విదేశాలలో ప్రయాణించే వారికి రోమింగ్ సేవలు వంటి సరికొత్త సేవలతో పోస్ట్‌పేయిడ్ ప్లస్ ఆకట్టుకోనుంది. ఈ మేరకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు.
జియో పోస్ట్ పెయిట్ ప్లస్ ప్లాన్ సెప్టెంబర్ 24వ తేదీ నుండి అందుబాటులో ఉంది. ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లో చేరాలనుకునే కస్టమర్లు వాట్సాప్‌లో 88-501-88-501 నెంబర్‌కు 'హాయ్' అని పంపించాలి. జియో పోస్ట్ పెయిడ్ ప్లస్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు జియో డాట్ కామ్ వెబ్ సైట్‌లో పొందవచ్చు.

jio.com/postpai పోర్టల్‌ను సందర్శించడం ద్వారా లేదా 1800-88998899 ఫోన్ చేయడం చేసి జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ సిమ్ కార్డును హోమ్ డెలివరీ ద్వారా పొందవచ్చు. సమీపంలోని జియో స్టోర్, రిలయన్స్ డిజిటల్ స్టోర్‌ను కూడా సందర్శించవచ్చు. మై జియో యాప్‌లోని జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ ఫ్యామిలీ ప్లాన్‌తో మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను లింక్ చేయండి.
జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ ద్వారా కస్టమర్లు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీతో పాటు జియో యాప్స్‌కు యాక్సెస్ కావొచ్చు. 650 లైవ్ టీవీ ఛానల్స్, వీడియో కంటెంట్స్, 5 కోట్ల పాటలు, 300కు పైగా న్యూస్ పేపర్స్ అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు 500GB డేటా రోలోవర్, వైఫై కాలింగ్ (దేశంలో, విదేశాల్లో) వంటి సౌకర్యాలు ఉన్నాయి. యూజర్లు రూ.250 చెల్లించడం ద్వారా జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్రయోజనాలను ఇతర కుటుంబ సభ్యులకు అందించవచ్చు.
జియో టారీఫ్ పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్స్ విషయానికి వస్తే... రూ.399తో 75GB డేటా, రూ.599తో 100GB డేటా, రూ.799తో 150GB డేటా, రూ.999తో 200GB డేటా, రూ.1499తో 300GB డేటా డేటా పొందవచ్చు.


Click it and Unblock the Notifications