ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)ను పురస్కరించుకొని రిలయన్స్ జియో తమ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు తీసుకు వచ్చింది. ఎంపిక చేసిన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్ కస్టమర్లకు ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ అందించేందుకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రూ.399తో ఏడాది పాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్స్ నెలకు రూ.399తో ప్రారంభమవుతున్నాయి. నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్స్‌తో కూడా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ను ఆఫర్ చేస్తోంది.
ఐపీఎల్ 2021 సీజన్ ఏప్రిల్ 9 శుక్రవారం రాత్రి 7:30 గంటలకు మొదటి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌ను డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో మాత్రమే చూడటానికి అవకాశముంది. మీరు కనుక ఎయిర్‌టెల్, జియో కస్టమర్లు అయితే ఐపీఎల్‌ను ఆన్‌లైన్‌లో ఉచితంగా వీక్షించవచ్చు.

జియో క్రికెట్ ప్లాన్స్ ఇవే... రూ.401 ప్లాన్‌తో 28 రోజుల పాటు 90GB డేటా వస్తుంది. ఇందులో రోజుకు 3GB డేటాతో పాటు అదనంగా 6GB డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితం. రూ.598 ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీ, 2GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితం. రూ.777 ప్లాన్‌తో 1.5GB డేటాతో పాటు అదనంగా 5GB డేటా లభిస్తుంది. 84 రోజుల పాటు మొత్తం 131GB డేటాను పొందుతారు. అపరిమిత వాయిస్ కాలింగ్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు ఉచితం.
రూ.2599 ప్లాన్ ఏడాది కాలపరిమితి కలిగి ఉంది. 2GB రోజు డేటాతో పాటు అదనంగా 10GB డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత వాయిస్ కాల్స్ పొందుతారు. ఈ ప్లాన్స్ అన్నింటికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌తో పాటు జియో, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ ఉచితం.


Click it and Unblock the Notifications