రిలయన్స్ జియో ఫైబర్ యూజర్లకు గుడ్‌న్యూస్
జియో సెట్ టాప్ బాక్స్ వినియోగిస్తున్న జియో ఫైబర్ యూజర్లకు గుడ్ న్యూస్. ఇప్పుడు జియో న్యూస్ వీరికి అందుబాటులోకి వచ్చింది. వీడియోలు, ఈ-పేపర్స్, మేగజైన్లు వంటి రూపాల్ల వార్తలు చూడవచ్చు. రిలయన్స్ జియో న్యూస్ సేవల్లో న్యూస్ ప్రొవైడర్లు, పబ్లిషర్లకు సంబంధించిన కంటెంట్ లభ్యమవుతుంది. ఈ ప్లాట్‌ఫాంలో 350 ఈ-పేపర్స్, 800 మేగజైన్స్ ఉంటాయి.
వీడియోలు, పిక్చర్ గ్యాలరీలు కూడా ఉన్నాయి.
న్యూస్ ప్లాట్‌ఫాం అతిపెద్ద యూఎస్పీలలో జియోన్యూస్ ఒకటి. 12 ప్రాంతీయ భాషలను కూడా సపోర్ట్ చేస్తుంది. ట్రెండింగ్ టాపిక్స్, న్యూస్ అలర్ట్స్ ఉంటాయి. ఈమేరకు జియో ప్రకటించింది. ఇందులో వాయిస్ కమాండ్ సెర్చ్ ఆప్షన్ ఉంది.

అలాగే జూమ్-ఇన్, జూమ్-ఔట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫుల్ పేజ్ వ్యూ, ఫుల్ స్క్రీన్ వ్యూ ఆప్షన్స్ ఉన్నాయి. జియో ఫైబర్ సబ్‌స్క్రైబర్స్ జియోకు చెందిన జియో సినిమా, జియో సావన్, జియో టీవీ ప్లస్ వంటి వాటితో పాటు ఓటీటీ యాప్స్‌కు కూడా యాక్సెస్ కావొచ్చు. ఎంటర్టైన్మెంట్, హెల్త్, మ్యూజిక్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, న్యూస్ అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలను అందిస్తుంది. పేపర్ లేదా వార్తా పత్రిక చదవడం లేదా ట్రెండింగ్ వీడియోలు, ఫోటోలు ఉంటాయి. జియో న్యూస్ సమాచార పరంపర. బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ ఉంటాయి. వినియోగదారులు 12 భాషల్లో తమకు ఇష్టమైన భాషను ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications