టెలికం ఆపరేటర్స్ భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ఇప్పటికే తమ టారిఫ్‌ను 20 శాతం నుండి 25 శాతం పెంచాయి. రిలయన్స్ జియో కూడా ఇతర టెల్కో దారిలోనే ప్రకటన చేసింది. అయితే తాజాగా రిలయన్స్ జియో తమ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. సరికొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. కేవలం రూ.1తో రీచార్జ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఒక రూపాయితో రీచార్జ్ చేసుకొని 30 రోజుల వ్యాలిడిటీతో 100MB డేటాను పొందవచ్చునని తెలిపింది. ఒకవేళ డేటా పరిమితి ముగిసిపోతే డేటా వేగం 64Kbpsకు తగ్గుతుంది. ఈ మేరకు జియో వెల్లడించింది. ఇప్పటి వరకు జియో అందిస్తున్న రీచార్జ్ ప్లాన్స్‌లో తక్కువ ధర కలిగింది ఇదే.
ప్లాన్ రీచార్జ్‌లో మరో సౌకర్యం కూడా ఉంది. యూజర్స్‌కు 500 ఎంబీ డేటా కావాలంటే ఐదుసార్లు, 1 జీబీ డేటా కావాలంటే 10సార్లు రీచార్జ్ చేసుకోవచ్చు. అయితే గరిష్టంగా ఎన్నిసార్లు రీచార్జ్ చేయాలనే దానిపై స్పష్టత లేదు. ఒక రూపాయి రీచార్జ్ కోసం యూజర్స్ మై జియో యాప్‌లోకి వెళ్లి, అందులోని అదర్స్‌లో వ్యాల్యూ సెక్షన్‌ను ఓపెన్ చేస్తే, అందులో రూపాయి రీచార్జ్ ప్యాక్ కనిపిస్తుంది.

జియో ప్రస్తుత 1GB డేటా ప్లాన్ కంటే తాజా ప్లాన్ చాలా తక్కువ. ఇప్పటికే ఉన్న 1GB డేటా ప్లాన్ వ్యాల్యూ రూ.15. కానీ రూ.1 ఆఫర్ ద్వారా 10సార్లు రీచార్జ్ చేసుకుంటే రూ.10 అవుతుంది. అప్పుడు 1GB డేటా వస్తుంది. అంటే రూ.5 ఆదా చేసినట్లు.
ఇటీవలే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సహా అన్ని టెల్కోలు సంస్థలు ప్రీపెయిడ ఛార్జీలను 20 శాతం నుండి 25 శాతం మేర పెంచాయి. గతవారం జియో రూ. 119 రీఛార్జ్ ప్లాన్‌ను సవరించింది. ఇందులో రోజువారీ 300 ఎస్సెమ్మెస్‌లతో పాటు, 1.5GB హైస్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ ఇస్తున్నట్లు తెలిపింది. అయితే ఇవే బెనిఫిట్స్‌ను రూ.98 ప్లాన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే రూ.98 ప్లాన్ కాలపరిమితి 14 రోజులు కాగా, రూ.119 కాలపరిమితి 28 రోజులు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications