రిలయన్స్ జియో ఫైబర్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్
రిలయన్స్ జియో తన ఫైబర్ కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. జియో ఫైబర్ యూజర్లు ప్రతి నెల ప్లాన్ కాకుండా వార్షిక, ఆరు నెలల ప్లాన్స్ ఎంచుకుంటే అదనపు వ్యాలిడిటీని అందించనున్నట్లు తెలిపింది. జియో ఫైబర్ వార్షిక ప్యాకేజీలపై 30 రోజుల అదనపు వ్యాలిడిటీని, ఆరు నెలల ప్యాకేజీపై 15 రోజులు అదనంగా వ్యాలిడిటీని అందిస్తోంది.
జియో ఫైబర్ వార్షిక ప్యాకేజీ రూ.4,788 నుండి ప్రారంభం కానున్నాయి. అంటే నెలకు రూ.399 బేస్ ప్లాన్ ఇది. ఈ కొత్త ఆఫర్ కింద వార్షిక కనెక్షన్ తీసుకున్నా కానీ, వార్షిక ప్లాన్‌కు అప్ గ్రేడ్ చేసుకున్నా కానీ వ్యాలిడిటీ 395 రోజులకు పెరుగుతుంది. అలాగే ఆరు నెలల ప్లాన్స్ పైన 15 రోజులు అదనంగా వ్యాలిడిటీ లభిస్తుంది.

ఈ కొత్త ఆఫర్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని వార్షిక, ఆరు నెలల ప్లాన్స్‌కు వర్తిస్తుంది. ఈ ఆఫర్ జియో ఫైబర్ రూ.399, రూ.699, రూ.999, రూ.1499, రూ.2499, రూ.3999, రూ.8499 నెలవారీ ప్రణాళికలకు వర్తిస్తుంది. ఈ ప్లాన్ గల కస్టమర్లకు 12 నెలల పాటు కొనుగోలు చేస్తే 30 రోజుల పాటు అదనపు డేటా పొందవచ్చు.


Click it and Unblock the Notifications