రిలయన్స్ జియో భారీ ఆఫర్ ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ బంపరాఫర్ ఇచ్చింది. జియోపై 4G వైర్‌లెస్ హాట్‌స్పాట్ కొనుగోలుపై ఐదు నెలల వరకు ఉచిత డేటా, జియో నుండి జియో కాల్స్ ఉచితంగా అందించనుంది. ఈ ఆఫర్ పొందాలంటే రూ.1,999తో జియో ఫైను కొనుగోలు చేయడంతో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్లాన్స్‌ను రీచార్జ్ చేసుకోవాలి. అప్పుడు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

చౌకైన ప్లాన్.. ప్రయోజనాలు
ప్రస్తుతం జియో ఫై కస్టమర్ల కోసం మూడు ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అతి చవకైన ప్లాన్ రూ.199తో రీచార్జ్ చేసుకుంటే 28 రోజుల కాలపరిమితితో 1.5GB డేటా, జియో నుండి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్, 1,000 వరకు జియో నుండి ఇతర నెట్ వర్క్స్‌కు కాల్ చేసుకోవచ్చు. దీనికి రూ.99తో జియో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే అదనంగా 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ జియో నుండి జియో కాల్స్, 1,000 వరకు ఇతర నెట్ వర్స్‌కు కాల్స్ 140 రోజుల పాటు లభిస్తుంది. 1,000 నిమిషాల తర్వాత నిమిషానికి 6 పైసలు ఉంటుంది.

రూ.249 ప్లాన్
మరో జియో ప్లాన్ రూ.249తో అందుబాటులో ఉంది. 2GB డేటా 28 రోజుల కాలపరిమితి ఉంటుంది. రూ.99తో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. వాటి ప్లాన్ ఆధారంగా వ్యాలిడిటీ ఉంటుంది. ఈ మెంబర్‌షిప్‌తో అదనంగా రోజుకు 2GB డేటా లభిస్తుంది. జియోకు అపరిమిత కాల్స్, ఇతర నెట్‌వర్క్స్‌కు 1,000 నిమిషాలు కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు చేయవచ్చు.

రూ.349 ప్లాన్.
కస్టమర్లు రూ.349 మూడో ప్లాన్ ఎంచుకుంటే రోజుకు 3GB డేటా వస్తుంది. ఇది 28 రోజుల కాలపరిమతి కలిగి ఉంటుంది. జియో నుండి జియోకు ఉచిత కాల్స్ అన్‌లిమిటెడ్. జియో నుండి ఇతర ఫోన్స్‌కు 1,000 కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు ఉంటాయి. వీటిని జియో డిజిటల్ స్టోర్స్ లేదా జియో వెబ్ సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ డివైజ్‌ను రూ.94 చొప్పున ఈఎంఐ చెల్లించి కూడా కొనుగోలు చేయవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications