Jio: జియో రూ.200 ప్లాన్లో అదిరిపోయే ఫీచర్లు.. ఓటీటీలు, లైవ్ టీవీ..!
జియో అదరిపోయే ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.200 ప్లాన్ మీకు బెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో రానుంది. ఈ ప్లాన్ లో భాగంగా మొత్తం 30GB హై-స్పీడ్ డేటాను వస్తుంది. అలాగే అనేక OTT ప్లాట్‌ఫారమ్‌లు, జియోటీవీకి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. జియో రూ.200 ప్లాన్ లో 30GB డేటాను వాడుకోవచ్చు వినియోగదారులు ఈ డేటాను ప్లాన్ వ్యాలిడిటీ కాలం మొత్తం తమ అవసరాలకు అనుగుణంగా వాడుకోవచ్చు. అయితే 30GB హై-స్పీడ్ డేటా అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64Kbpsకి తగ్గిపోనుంది. అలాగే ఈ ప్లాన్‌లో ప్రత్యేకంగా అపరిమిత వాయిస్ కాలింగ్ ఉండదు. అలాగే ఉచిత ఎస్ఎంఎస్ లు కూడా రావు. ఈ ప్లాన్ కేవలం డేటా, ఓటీటీల కోసమే మాత్రమేనని గమనించాలి.
ఈ ప్లాన్ లో భాగంగా అనేక ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. జియో రూ.200 రిఛార్జీలో యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, జియోహాట్‌స్టార్, సోనీ LIV, ZEE5, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ NXT, కంచ లంకా, ETVWin, చౌపాల్, హోయిచోయ్, ఫ్యాన్‌కోడ్, టైమ్స్ ప్లే, తరంగ్ ప్లస్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఉచితంగా వాడుకోవచ్చు. ఈ ప్లాన్లో జియోటీవీ ద్వారా 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెళ్లను కూడా లైవ్ లో చూడవచ్చు. ఈ ప్లాన్‌లో సోనీ, సన్ టీవీ, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, ఈటీవీ వంటి అనేక నెట్‌వర్క్‌ల ఛానళ్లు ఉన్నాయి. అయితే ఈ ప్రయోజనంలో స్పోర్ట్స్ ఛానళ్లు లేవని గమనించాలి.

జియో రూ.200 ప్లాన్‌లో సినీపోలిస్ టిక్కెట్లపై రూ.150 వరకు తగ్గింపు విస్తుంది. కనీసం రూ.550 బుకింగ్, రెండు టిక్కెట్లపై ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని జియో పేర్కొంది. మీకు ఆహారం, పానీయాలపై 10 శాతం తగ్గింపు రానుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే..ఈ ఆఫర్ మంగళవారం నాడు చెల్లుబాటు కాదని గుర్తుంచుకోవాలి. ఈ ప్లాన్‌కు కూడా ట్రూ 5G ట్యాగ్ ఉన్నప్పటికీ, అపరిమిత 5G డేటాను పొందాలంటే మీకు రోజుకు 1GB లేదా 1.5GB డేటా ఉన్న బేస్ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications