Jio Financial Services Ltd: 6 శాతం పెరిగిన జియో ఫైనాన్షియల్ స్టాక్..

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ శుక్రవారం భారీగా పెరిగింది. ఈ రోజు సెషన్ లో 6 శాతానికి పైగా పెరిగింది. గత సెషన్ లో రూ.235.65 వద్ద ముగిసిన షేర్ ప్రైస్.. ఈ రోజు రూ.249 లకు చేరుకుంది. చివరకు రూ.242 వద్ద స్థిరపండింది. మొదటి త్రైమాసిక ఫలితాలు అంచనాలు అందుకోవడంతో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. వడ్డీ ఆదాయం, ఫీజులు, కమీషన్ ఆదాయంలో బలమైన వృద్ధి, అధిక డివిడెండ్ ఆదాయం కారణంగా, మొదటి త్రైమాసిక ఆదాయాలు గణనీయంగా పెరిగాయని కంపెనీ పేర్కొంది.

గత మూడు నెలల కాలంలో ఏకీకృత నికర లాభం గతేడాదితో పోలిస్తే 156 శాతం పెరిగి రూ.830 కోట్లకు చేరింది. జియో పేమెంట్స్ బ్యాంక్, జియో పేమెంట్ సొల్యూషన్స్ రాణించాయి. అలియాంజ్ ఇన్సూరెన్స్ జాయింట్ వెంచర్లతో పాటు, తన బ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్‌మెంట్, వెల్త్ మేనేజ్‌మెంట్, బ్రోకింగ్ వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు కంపెనీ వివరించింది. జియో క్రెడిట్ నిర్వహణలో ఉన్న ఆస్తులు రూ.300 బిలియన్లు దాటడంతో అది బాగా వృద్ధి చెందిందని మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది.

jio Financial

ఈ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 1.55 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.338 కాగా.. కనిష్ట స్థాయి రూ. 223.30 గా ఉంది. గత 6 నెలల వ్యవధిలో ఈ స్టాక్ 12 శాతం పడిపోగా, ఏడాదిలో 24 శాతం వరకు తగ్గింది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో స్టాక్ పాజిటివ్ గా స్పందించింది. కొనసాగుతున్న వ్యాపారాలలో పెట్టుబడులకు సంబంధించిన పెరిగిన నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని మోతీలాల్ ఓస్వాల్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బై రేటింగ్ ఇచ్చింది. టార్గెట్ ప్రైస్ ను రూ.315 గా ఫిక్స్ చేసింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీ మెర్జ్ అయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెపరేట్గా లిస్ట్ అయింది. జియో ఫైనాన్షియల్ పేమెంట్ బ్యాంక్, ఇన్సూరెన్స్ బ్రోకింగ్, ఫైనాన్సింగ్, పెట్టుబడి వంటి సేవలు అందిస్తోంది. 2023లో స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ అయింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+