Jio Financial Shares: దేశీయ స్టాక్ మార్కెట్లలో పరిస్థితులు గంటగంటకూ, రోజురోజుకూ మారిపోతున్నాయి. ఈ క్రమంలో దానికి తగినట్లుగానే ఇన్వెస్టర్లు కూడా వివిధ షేర్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అదృష్టం అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ కంపెనీ షేర్లకు పట్టింది.
ఇంట్రాడేలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 6% కంటే ఎక్కువ పెరిగాయి. ఎన్ఎస్ఈ నిన్న జారీచేసిన సర్క్యులర్ లోని వార్త మార్కెట్లలో పెట్టుబడిదారులను భారీగా ఆకర్షిస్తోంది. వాస్తవానికి కొత్తగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేందుకు అనుమతాలని నిర్ణయించిన 45 కంపెనీల జాబితాలో జియో ఫైనాన్షియల్స్ కూడా చోటు దక్కించుకుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం నవంబర్ 29 నుంచి కొత్తగా ఎంపిక చేయబడిన కంపెనీలు ట్రేడర్ల కోసం అందుబాటులోకి రానున్నాయి. ఉదయం ఎన్ఎస్ఈలో కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.302.75 వద్ద ట్రేడింగ్ ప్రారంభించగా.. మధ్యాహ్నం 2.50 గంటల సమయంలో ఒక్కో షేరు రూ.316.50 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో కంపెనీ షేర్లు దాదాపు 6 శాతం మేర లాభపడ్డాయి.

ప్రస్తుతం అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్స్ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2 లక్షల కోట్లుగా ఉంది. ఈ క్రమంలో 52 వారాల కనిష్ఠ ధర రూ.215 వద్ద ఉండగా.. 52 వారాల గరిష్ఠ ధర రూ.394.70గా ఉంది. ఎన్ఎస్ఈ రిలీజ్ చేసిన 45 కంపెనీల జాబితాలో ప్రధానంగా ట్రేడర్లను ఆకట్టుకుంటున్న కొన్ని కంపెనీల పేర్లను పరిశీలిస్తే.. జొమాటో, డీమార్ట్, యెస్ బ్యాంక్, పేటీఎం, ఎల్ఐసీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదానీ టోటల్ గ్యాస్, ఏంజెల్ వన్, నైకా, కేపీఐటీ టెక్నాలజీస్, టాటా ఈఎల్ఎక్స్ఎస్ఐ ఉన్నాయి.
కంపెనీ ఇటీవల తన రెండవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ నికర లాభం రూ.689 కోట్లుగా నమోదైంది. గడచిన ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం కేవలం రూ.668 కోట్లుగా ఉంది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.693.5 కోట్లుగా ఉన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు సైతం కంపెనీ షేర్లలో తమ పెట్టుబడులను క్రమంగా తగ్గించుకుంటున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నాటికి విదేశీ పెట్టుబడిదారుల వాటా కంపెనీలో 21.58 నుంచి ప్రస్తుతం 16.88కి తగ్గాయి. ఇక మ్యూచువల్ ఫండ్ కంపెనీలు కేవలం 4.17 శాతం వాటాను హోల్డ్ చేస్తున్నారని తేలింది.


Click it and Unblock the Notifications