Jio Financials: మార్కెట్లోకి అడుగుపెట్టిన జియో ఫైనాన్సియల్స్.. నష్టాల్లో పయనం..
Jio Financial Services: దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ నుంచి డీమెర్జ్ అయిన జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెక్ కంపెనీ షేర్లు మార్కెట్లోకి అడుగు పెట్టాయి.

ఉదయం 10 గంటల తర్వాత మార్కెట్లోకి జియో ఫైనాన్సియల్ స్టాక్ అడుగు పెట్టింది. దీనికి ముందు స్టాక్ ధర రూ.261.85గా గతంలో జరిగిన ట్రేడింగ్ ద్వారా నిర్ణయించబడింది. అయితే ఈరోజు మార్కెట్లోకి అడుగుపెట్టిన తర్వాత స్టాక్ ధర క్షీణతను నమోదు చేస్తోంది. ఉదయం 10.10 గంటల సమయంలో స్టాక్ 4.95 శాతం మేర నష్టపోయి ఎన్ఎస్ఈలో రూ.248.90 రేటు వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

ప్రీ-మార్కెట్ బ్లాక్ ట్రేడ్‌లో స్టాక్‌లో 1.4 కోట్ల షేర్లు చేతులు మారాయి. స్టాక్‌లో తరువాతి 10 ట్రేడింగ్ సెషన్‌లకు ఐదు శాతం సర్క్యూట్ ఫిల్టర్ ఉంటుంది. న్యూ ఏజ్ కంపెనీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎటువంటి ఈక్విటీని తగ్గించకుండా రాబోయే మూడేళ్లపాటు పుస్తకాన్ని నిర్మించగలదని వెల్లడైంది. లిస్టింగ్ తర్వాత మొదటి 10 రోజుల పాటు స్టాక్ ట్రేడ్-టు-ట్రేడ్ విభాగంలో ట్రేడ్ చేయబడుతుంది. అంటే దీనికింద ఇంట్రాడే ట్రేడ్ చేయటం కుదరదు. డెలివరీ కింద మాత్రమే షేర్లను కొనుగోలు చేయటానికి వీలు ఉంటుందని ఇన్వెస్టర్లు గమనించాలి.
10.20 గంటల సమయంలో జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ స్టాక్ 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను ఎన్ఎస్ఈలో తాకింది. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు నిరాశకు గురయ్యారు. కంపెనీ దేశీయ ఫైనాన్సియల్ సర్వీసెస్ రంగంలో కీలక ఆటగాడిగా నిలుస్తుందని అందరూ ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications