RIL-Jio Demerger: నేడే జియో ఫైనాన్సియల్స్ అరంగేట్రం.. లిస్టింగ్ ధర ఎంతంటే..??
RIL-Jio Demerger: ఇన్వెస్టర్లకు చాలా కాలం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి రెండో సంస్థ మార్కెట్లోకి రావటం ఆనందాన్ని కలిగిస్తోంది. రిలయన్స గ్రూప్ తన ఫైనాన్స్ వ్యాపారాన్ని విడదీయటం ద్వారా వాల్యూ అన్ లాకింగ్ చేయాలని చూస్తోంది.
ఆర్థిక సేవల విభాగం డీమెర్జర్ కారణంగా జూలై 20, గురువారం మొదటి 45 నిమిషాల పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సాధారణ ట్రేడింగ్‌కు అందుబాటులో ఉండవు. Jio ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(JFSL) విభజన వల్ల ఉదయం 9:00 నుంచి 10:00 AM మధ్య ప్రత్యేక ప్రీ-ఓపెన్ కాల్ వేలానికి లోనవుతాయి. ఈ సెషన్‌లో ఆర్డర్‌లను మాత్రమే పెట్టవచ్చు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జియో ఫైనాన్సియల్స్ స్టాక్ రూ.251 ధరకి లిస్ట్ కావొచ్చని తెలుస్తోంది.

రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ విభజన తర్వాత జియో ఫైనాన్షియల్‌గా పేరు మార్చబడుతుంది. విభజన కింద రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ హోల్డర్లకు కలిగి ఉన్న ఒక్కో ఆర్ఐఎల్ షేరుకు గాను మరో Jio ఫైనాన్షియల్ షేర్ అందించటం జరుగుతుంది. ఈ క్రమంలో బుధవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ దాదాపు 1.15 శాతం లాభపడి రూ.2,853 వద్ద ట్రేడింగ్ ముగించింది. జియో ఫైనాన్షియల్‌ను కొనుగోలు చేసేందుకు జూలై 9 నాటికి RIL కొనుగోలు చేసిన వారు మాత్రమే అర్హులు. రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ విభజన తర్వాత జియో ఫైనాన్షియల్‌గా పేరు మార్చబడుతుంది.
JFSL సమీప భవిష్యత్తులో కన్జూమర్ లోన్స్, SME లోన్స్, ఇన్సూరెన్స్, చెల్లింపులు, డిజిటల్ బ్యాంకింగ్‌లలోకి ప్రవేశించవచ్చు. దీని ప్రధాన పోటీ బజాజ్ ఫైనాన్స్, ఇతర ఫిన్‌టెక్ కంపెనీల నుంచ్ ఉంటుంది. జియో ఫిన్ నిఫ్టీలో లిస్టింగ్ అయ్యే వరకు 51వ స్టాక్‌గా ఉంటుంది. జియో ఫైనాన్షియల్ నిఫ్టీ నుంచి లిస్టింగ్ పోస్ట్ చేస్తుంది. Jio ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రణాళికాబద్ధమైన విభజనను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదించిందని RIL జూలై 8న BSE ఫైలింగ్‌లో వెల్లడించింది. ఇది జూలై 20, 2023ని రికార్డు తేదీగా ప్రకటించింది.


Click it and Unblock the Notifications