Jio Financial Services: రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఫైనాన్స్ సర్వీసెస్ విభాగమైన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ను సపరేట్ ఎంటిటీగా తీసుకొస్తోంది. అనేక దశాబ్దాల తర్వాత రిలయన్స్ నుంచి మరో కొత్త కంపెనీ లిస్ట్ అవుతోంది. చాలా మంది ఇన్వెస్టర్లు దీనిపై ఇప్పటికే సానుకూలంగా ఉన్నారు.
కంపెనీ విభజన ద్వారా వ్యాల్యూ అన్ లాకింగ్ జరిగి ఇన్వెస్టర్లు గణనీయమైన విలువను పొందుతారని బ్రోకరేజీలు చెబుతున్నాయి. మరో రెండు రోజుల్లో జూలై 20న కొత్త కంపెనీ మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే జోష్ లో ఉన్న ఇన్వెస్టర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల కోసం ఎగబడటంతో స్టాక్ బీఎస్ఈలో 1% పైగా పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి రూ.2,825.95కి చేరాయి. కొత్తగా వస్తున్న కంపెనీ నిఫ్టీ 50 జాబితాలో చేర్చబడుతుందని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వెల్లడించింది.

జూలై 20న ప్రత్యేక ప్రీ-ఓపెన్ సెషన్ నిర్వహించనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ తెలిపింది. కొత్త నోట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లను రికార్డ్ డేట్ కంటే ముందే అంటే జూలై 20కి ముందే కొనుగోలు చేయాలని యాక్సిస్ సెక్యూరిటీస్ ఇన్వెస్టర్లకు సూచించింది. ఎందుకంటే ఇది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను కొనుగోలు చేయడానికి మరింత పొదుపుగా ఉంటుందని అభిప్రాయపడుతోంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు ఒక్కో షేరుకు రూ.160 చొప్పున లిస్ట్ అవ్వొచ్చని తెలుస్తోంది.
Jio ఫైనాన్షియల్ సర్వీసెస్ విభజనను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదించినట్లు జూలై 8న BSE ఫైలింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ తో తన ఆర్థిక సేవల యూనిట్ విలీనానికి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ గా పేరు మార్చనున్నట్లు ఆర్‌ఐఎల్ తెలిపింది. ఈ కంపెనీ ప్రాపర్టీ డేటా విశ్లేషణ ఆధారంగా వినియోగదారులకు, వ్యాపారాలకు రుణాలను అందిస్తుంది. అలాగే బీమా, చెల్లింపులు, డిజిటల్ బ్రోకింగ్, అసెట్ మేనేజ్‌మెంట్ సేవలను కూడా అందించనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డు శుక్రవారం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలతో పాటు తన ఇన్వెస్టర్లకు డివిడెండ్లను ఇవ్వడాన్ని చూస్తోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications