Jio Financial Services: రిలయన్స్ ఇన్వెస్టర్ల ఎదురుచూపులకు గడువు ముగిసింది. ముఖేష్ అంబానీ తన ఫైనాన్స్ వ్యాపారాన్ని విడదీయాలని నిర్ణయించటంతో తాజాగా జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్రత్యేక కంపెనీగా ఏర్పడిన సంగతి తెలిసిందే.
అయితే అంబానీ తన రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడిదారులకు కొత్త కంపెనీలో వాటాలను ఇస్తామని ప్రకటించారు. ఇది నేడు కార్యరూపం దాల్చింది. సుమారు మూడు వారాల క్రితం స్టాక్ ఎక్స్ఛేంజీలు JFS షేర్ల ధర నిర్ణయం కోసం ప్రత్యేక ప్రీ-ఓపెన్ సెషన్‌ను నిర్వహించింది. ప్రస్తుతం అర్హత కలిగిన ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల్లోకి కొత్త కంపెనీ JFS షేర్ల జమ జరిగింది. అయితే స్టాక్ లిస్టింగ్ తేదీని రిలయన్స్ గ్రూప్ ఇంకా ప్రకటించలేదు.

ఇన్వెస్టర్ల ఖాతాల్లో రూ.261.85 విలువ కలిగిన జియో ఫైనాన్సియల్స్ స్టాక్స్ లిస్టింగ్ కాకముందు ట్రేడింగ్ చేయటానికి కుదరదు. ఇది నిఫ్టీ-50లో చేర్చబడిన 51వ కంపెనీ. విదేశీ బ్రోకింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ మళ్లీ రూ.3,000 టార్గెట్ ధరతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లపై 'ఓవర్ వెయిట్' రేటింగ్ ఇచ్చింది. అయితే దేశీయ మార్కెట్లో కంపెనీ వ్యాపారాలకు రానున్న కాలంలో డిమాండ్ దృష్యా స్టాక్ టార్గెట్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ-బిజినెస్ భాగస్వామ్యం ఆధారంగా రుణం ఇవ్వడానికి లక్ష్యాన్ని నిర్దేశిస్తుందని బ్యాంకింగ్ నిపుణుల అభిప్రాయపడుతున్నారు. కిరానా స్టోర్‌లకు సంబంధించిన డేటా జియో ఫైనాన్షియల్‌కు ప్రయోజనకరంగా ఉంటుందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ఎఎస్‌వి కృష్ణన్ వెల్లడించారు. జియో ఫైనాన్షియల్ ఇతర సంస్థల కంటే కిరానా స్టోర్‌లు, వ్యాపారుల గురించిన సమాచారాన్ని కలిగి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది కంపెనీ కలిసొచ్చే వ్యాపార అవకాశం అని అన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications