దేశీయ స్టాక్ మార్కెట్ నేడు వరుసగా రెండో రోజు క్షీణత చూస్తున్నప్పటికీ భారత కంపెనీల అధిపతి, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు అయిన ముఖేష్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (JFSL) షేర్లు వరుసగా రెండో రోజు భారీ వృద్ధిని నమోదు చేశాయి. జియో ఫైనాన్షియల్ అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ బ్లాక్‌రాక్ జాయింట్ వెంచర్ అయిన జియో బ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడుకు భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ వ్యాపారం ప్రారంభించడానికి సెబీ (SEBI) నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడమే దీనికి ప్రధాన కారణం.

ఈ ఆమోదంతో జియో బ్లాక్‌రాక్ త్వరలోనే భారత మ్యూచువల్ ఫండ్ మార్కెట్‌లోకి ప్రవేశించవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ శుభవార్త కారణంగా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (JFSL) షేర్లు నేడు ఉదయం ట్రేడింగ్‌లో రూ.299.20కి పెరిగి, పెట్టుబడిదారుల ఆసక్తిని ఆకర్షించాయి. నిన్న బీఎస్‌ఈలో కంపెనీ షేర్ రూ.291.50 వద్ద ముగిసింది.
షేర్ల దూకుడు: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేరు 52 వారాల గరిష్ట ధర రూ. 368.30 (గత ఏడాది జూన్ 20న) కాగా, 52 వారాల కనిష్ట స్థాయి రూ.198.60 (ఈ ఏడాది మార్చి 3న) వద్ద ఉంది. అయితే, బ్లాక్‌రాక్‌తో జాయింట్ వెంచర్‌కు సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఈ షేరు మంచి వృద్ధిని చూస్తోంది. సెబీ నిబంధనల ప్రకారం, కంపెనీ ఆరు నెలల్లోగా మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ కొత్త వెంచర్‌కు సారథిగా సిడ్ స్వామినాథన్ జియోబ్లాక్‌రాక్ ఎండీ (MD) అండ్ సీఈఓ (CEO)గా నియమితులయ్యారు. ఆయన బ్లాక్‌రాక్‌లో అంతర్జాతీయ ఇండెక్స్ ఈక్విటీల మాజీ అధిపతిగా $1.25 ట్రిలియన్ల విలువైన ఆస్తులను నిర్వహించిన అనుభవం ఉంది.
రూ.70 లక్షల కోట్ల పరిశ్రమపై దృష్టి: భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏప్రిల్ చివరి నాటికి, పరిశ్రమ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు (AUM) ఏకంగా రూ.70 లక్షల కోట్లుగా ఉన్నాయి. జియోబ్లాక్‌రాక్ ఈ పరిశ్రమలోకి ప్రవేశించిన 48వ ఏఎంసీ (AMC - అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ) అవుతుంది. దేశంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ గత 10 సంవత్సరాలుగా ఏటా 18 శాతం చొప్పున స్థిరంగా వృద్ధి చెందుతోంది. దేశంలో ప్రస్తుతం 8.89 కోట్ల ఎస్‌ఐపీలు (SIPs) ఉండగా, ప్రతినెల నిధుల ప్రవాహం రూ.26,632 కోట్లకు చేరుకుంది.
జియోబ్లాక్‌రాక్ వివిధ పెట్టుబడి ఉత్పత్తులను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో బ్లాక్‌రాక్ అత్యాధునిక టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ అయిన 'అల్లాదీన్' మద్దతు జియో బ్లాక్‌రాక్‌కు లభించనుంది. ఇది డిజిటల్-ఫస్ట్ విధానంతో తక్కువ ఖర్చుతో కూడిన సంస్థాగత నాణ్యత గల ఉత్పత్తులను నేరుగా పెట్టుబడిదారులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications