కొంత కాలం కిందట రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ విడిపోయింది. ఈ క్రమంలో ఐపీవో సైతం మంచి స్పందనను పొందింది.
అయితే తాజాగా కంపెనీ తన మూలధన అవసరాల కోసం రూ.10,000 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. కంపెనీ తన మొదటి బాండ్ ఇష్యూని ప్రారంభించాలని చూస్తోందని వెల్లడైంది. దీనికోసం కంపెనీ ప్రస్తుతం మర్చంట్ బ్యాంకర్లతో చర్చలు జరుపుతోంది. రానున్న ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యలో దీనిని ప్రారంభించొచ్చని తెలుస్తోంది. ఈ బాండ్ ఇష్యూ ద్వారా రూ.5,000 నుంచి రూ.10,000 కోట్ల వరకు సమీకరించాలని చూస్తోంది.

ఈ వార్తల నేపథ్యంలో కంపెనీ షేర్లు నేడు లాభపడ్డాయి. ప్రస్తుతం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దాని క్రెడిట్ రేటింగ్, ఇతర అవసరమైన అనుమతులను పొందే ప్రక్రియలో ఉంది. Jio ఫైనాన్షియల్ బలమైన ప్రమోటర్ పేరెంటేజ్‌ని కలిగి ఉన్నందున ఆటోమేటిక్‌గా 'AAA' క్రెడిట్ రేటింగ్‌ను పొందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నాన్-ఫైనాన్షియల్ భారతీయ సంస్థ ద్వారా అతిపెద్ద ఇష్యూలో 10 ఏళ్ల బాండ్ల ద్వారా రూ.200 బిలియన్లను సేకరించింది. ఇది ప్రభుత్వ రుణ వ్యయం కంటే 40 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉంది.
రిలయన్స్ జారీ చేసిన బాండ్ల కంటే జియో ఫిన్ జారీ చేసే బాండ్ల కూపన్ రేటు కాస్త అధికంగానే ఉండొచ్చని చెబుతున్నారు. బాండ్ల జారీపై జియో ఫైనాన్షియల్ అధికారికంగా స్పందించలేదు. రానున్న కాలంలో జియో ఫైనాన్షియల్ హోమ్, పర్సనల్, ఆటో లోన్స్ ద్వారా పూర్తి స్థాయి ఫైనాన్షియల్ సంస్థగా అవతరించాలనుకుంటోంది. దీంతో కంపెనీ పెద్ద NBFC కంపెనీగా రూపాంతరం చెందాలని చూస్తోందని తెలుస్తోంది. ఇదే క్రమంలో దేశంలో రెండవ అతిపెద్ద రుణ సంస్థగా ఉన్న రిలయన్స్ క్యాపిటల్ సంస్థను హిందుజా గ్రూప్ కొనుగోలు పెద్ద పోటీకి దారితీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications