Jio Financial Services: కొన్ని నెలల కిందట ముఖేష్ అంబానీ తన ఫైనాన్స్ వ్యాపారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి విభజించారు. ఈ క్రమంలో దానిని కొత్త కంపెనీగా మార్కెట్లోకి ఐపీవోగా తీసుకొచ్చారు. అలా ఆర్ఐఎల్ షేర్ హోల్డర్లకు ఉచితంగా కొత్త కంపెనీ షేర్లను అందించిన సంగతి తెలిసిందే.
తాజాగా అంబానీ ఫైనాన్స్ కంపెనీ జియో ఫైనాన్షియల్స్ తన రెండవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. చాలా మంది ఇన్వెస్టర్ల కళ్లు ఈ కంపెనీ పనితీరుపై ప్రస్తుతం ఉన్నాయి. సెప్టెంబరుతో ముగిసిన క్వార్టర్‌లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.668.18 కోట్లుగా ప్రకటించింది. దీంతో లాభాలు త్రైమాసిక ప్రాతిపధికన రెండితలయ్యాయి. అలాగే రెవెన్యూ గత త్రైమాసికం కంటే 47 శాతం వృద్ధి చెందింది.

ఈ క్రమంలో కంపెనీ వడ్డీ ఆదాయం గత త్రైమాసికంలోని రూ.202 కోట్ల కంటే తక్కువగా రూ.186 కోట్లుగా నమోదైంది. అలాగే డివిడెండ్ ఆదాయం రూ.217 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. స్టాక్ మార్కెట్ ఎక్స్ఛేంజీల్లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1.43 లక్షల కోట్లుగా ఉంది. కంపెనీ ఎక్స్ఛేంజ్ నోటిఫికేషన్‌లో అక్టోబర్ 16, 2023 నుంచి గ్రూప్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా AR గణేష్‌ను నియమించినట్లు పేర్కొంది.
తాజా ఆర్థిక ఫలితాల తర్వాత ఎన్ఎస్ఈలో నేడు ఉదయం 9.35 గంటల సమయంలో స్టాక్ ధర స్వల్పంగా పెరిగి రూ.228.25గా ఉంది. ఇదే క్రమంలో మ్యూచువల్ ఫండ్ కంపెనీలు సెప్టెంబర్ నెలలో రూ.2,850 కోట్లు విలువైన జియో ఫైనాన్షియల్ కంపెనీలోని తమ పెట్టుబడులను విక్రయించాయి. ప్రధానంగా మెజారిటీ వాటాలను SBI మ్యూచువల్ ఫండ్, UTI మ్యూచువల్ ఫండ్, Nippon మ్యూచువల్ ఫండ్, HDFC మ్యూచువల్ ఫండ్ వాటాలను విక్రయించాయి. ఈ క్రమంలో యాక్సిస్ బ్యాంక్ మాత్రం కొత్త వాటాలను కొనుగోలు చేసిందని వెల్లడైంది.


Click it and Unblock the Notifications