Reliance AGM: రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక ప్రకటన చేశారు. దీని ప్రకారం జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ రానున్న కాలంలో ఇన్సూరెన్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వెల్లడించారు.
గ్లోబల్ ప్లేయర్ల భాగస్వామ్యంతో డిజిటల్ ఇంటర్‌ఫేస్ ద్వారా సింపుల్, స్మార్ట్, లైఫ్, జనరల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను అందించడానికి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బీమా రంగంలోకి ప్రవేశిస్తుందని ముఖేష్ అంబానీ ఏజీఎంలో స్టేక్ హోల్డర్లకు వెల్లడించారు. JFS భారతదేశపు అద్భుతమైన వృద్ధి కథనాన్ని వేగవంతం చేయటానికి పుట్టిందని అన్నారు. ఇది డిజిటల్-ఫస్ట్ విధానంతో ఫిన్ సేవల వ్యాప్తిని పెంచి ఫిన్ టెక్ ఉత్పాతులను సులభతరం చేస్తుందని అభిప్రాయపడ్డారు.

ఇది ఖర్చులను తగ్గించి ఎక్కువ పరిధికి విస్తరిస్తుందని అంబానీ పేర్కొన్నారు. ఇదే క్రమంలో అసెట్ మేనేజ్‌మెంట్ వ్యాపారాన్ని ఏర్పాటు చేయడానికి అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ బ్లాక్‌రాక్‌తో JFSL జాయింట్ వెంచర్ గురించి కూడా ముఖేష్ అంబానీ మాట్లాడారు. ఇవి దేశంలోని ప్రజలకు, పెట్టుబడిదారులకు నమ్మదగిన వినూత్న పెట్టుబడి పరిష్కారాలను అందిస్తుందని చెప్పారు.

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉత్పత్తులు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తాయని అందువల్ల అవి సురక్షితమైనవని అన్నారు. JFS విజయం గురించి నమ్మకంగా ఉండటానికి తన వద్ద మూడు కారణాలు ఉన్నాయని అంబానీ తెలిపారు. ముందుగా డిజిటల్-ఫస్ట్ ఆర్కిటెక్చర్ కాగా రెండవది కంపెనీ భారీ రూ.1.20 లక్షల కోట్ల క్యాపిటలైజేషన్ గా ఉంది. మూడవది అనుభవజ్ఞుడైన మరియు అత్యంత గౌరవనీయమైన బ్యాంకర్ అయిన శ్రీ కెవి కామత్ నేతృత్వంలోని చాలా బలమైన బోర్డుతో కంపెనీ ముందుకు సాగుతోందని అంబానీ తెలిపారు.


Click it and Unblock the Notifications