Mutual Funds: ప్రస్తుతం చాలా కాలంగా దేశంలో మ్యూచువల్ ఫండ్ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా లాభాలను తెచ్చిపెడుతోంది. ఈ క్రమంలో అనేక ఫైనాన్స్, ఫిన్ టెక్ సంస్థలు ఇప్పటికే ఈ రంగంలో తమ వ్యాపారాలను షురూ చేశాయి. అయితే ముఖేష్ అంబానీ సైతం ఈ వ్యాపారంలో ముందుకు సాగేందుకు తన జియో ఫైనాన్షియల్స్ ద్వారా వేగంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు అంబానీ నుంచి ఇప్పుడొక శుభవార్త ఉంది. తాజాగా ఈ రంగంలో అంబానీ కంపెనీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, అమెరికాకు చెందిన బ్లాక్‌రాక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఇంక్ జాయింట్ వెంచర్‌కు సెబీ నుంచి ఆమోదం లభించింది. మార్కెట్లో ఇన్వెస్టర్లు ప్రస్తుతం అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ షేర్లపై ఈ క్రమంలో కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. శుక్రవారం మార్కెట్ల ముగింపు సమయంలో కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.338.75 రేటు వద్ద స్థిరపడ్డాయి. ఈ క్రమంలో కంపెనీ షేర్ల 52 వారాల కనిష్ఠ ధర రూ.204.65గా ఉండగా.. 52 వారాల గరిష్ఠ ధర రూ.394.70 వద్ద ఉంది.

కంపెనీ అందించిన వివరాల ప్రకారం జియో ఫైనాన్షియల్స్, బ్లాక్ రాక్ సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న మ్యూచువల్ ఫండ్ సంస్థకు అవసరమైన అన్ని షరతులు నెరవేర్చినందున సెబీ నుంచి ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రానున్న రోజుల్లో మ్యూచువల్ ఫండ్ రంగంలో జియో పెద్ద ఆటగాడిగా అవతరించి గట్టిపోటీని అందించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వాస్తవానికి ఈ ఫిన్ టెక్ కంపెనీ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమెర్జ్ చేయబడిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీ అసెట్ మేనేజ్మెంట్, వెల్త్ మేనేజ్మెంట్ కోసం బ్లాక్‌రాక్‌తో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీటికి తోడు కంపెనీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్ బ్రోకింగ్, పేమెంట్స్ బ్యాంకు అండ్ చెల్లింపు అగ్రిగేటర్, పేమెంట్ గేట్‌వే సేవల వ్యాపారంలో నిమగ్నమై ఉంది.
జియో బ్లాక్‌రాక్ దేశంలోని పెట్టుబడిదారులకు సరసమైన, వినూత్న పెట్టుబడి పరిష్కారాలను అందించే లక్ష్యంతో ముందుకొస్తున్నట్లు రిలయన్స్ గ్రూప్ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో మ్యూచువల్ ఫండ్స్ వ్యాపార విలువ దాదాపు 580 బిలియన్ డాలర్లుగా ఉన్నందున జియో ఫైనాన్షియల్ దీనిపై ప్రధానంగా దృష్టి సారించింది. మార్కెట్ నైపుణ్యంతో పాటు పెట్టుబడి, రిస్క్ మేనేజ్‌మెంట్‌లో విస్తృతమైన నైపుణ్యాన్ని కలిగి ఉన్న బ్లాక్‌రాక్ 2022 నాటికి మొత్తం 8.2 ట్రిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉందని సమాచారం.
బ్రోకరేజ్ అంచనాలు ఇవే..
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎన్‌బీఎఫ్‌సీ అండ్ ఫైనాన్స్ ఆర్థిక వ్యవస్థతో సన్నిహిత సంబంధాలు కలిగిన సంస్థగా కొనసాగుతోంది. అందువల్ల దీర్ఘకాలంలో కంపెనీ షేర్లు కొనుగోలు చేసి హోల్డ్ చేయటం మంచి రాబడులను అందించటంలో దోహదపడుతుందని ఏంజెల్ వన్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమర్ డియో సింగ్ వెల్లడించారు. రిలయన్స్ గ్రూప్ కంపెనీ ఆర్థిక వ్యవస్థలో రిలయన్స్ ప్రధాన ఆటగాడిగా కొనసాగుతున్నందున షేర్లను దీర్ఘకాల వ్యూహంతో పెట్టుబడి పెట్టాలని ఆయన ఇన్వెస్టర్లకు సిఫార్సు చేశారు. ఈ క్రమంలో ఆయన కంపెనీ షేర్లకు ఎటువంటి టార్గెట్ ధరలను ప్రకటించలేదు. దీనిని కేవలం ఫండమెంటల్స్ ఆదారంగా ట్రేడింగ్ చేసే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు మాత్రమే ఇది పెట్టుబడి ఆలోచనగా సూచించారని అర్థం చేసుకోవచ్చు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications